డీసీపీ (క్రైం) బి.సాయిశ్రీ
హైదరాబాద్, నవంబర్ 14 (ఆదాబ్ హైదరాబాద్ ): సైబర్ క్రైం పోలీస్ సైబరాబాద్ పరిధిలో ఈ నెల 6 నుంచి 11 వరకు జరిగిన 3 కేసులను గుర్తించి వివిధ రాష్ట్రాల్లో నడుస్తున్న సైబర్ నేరాలతో సంబంధం ఉన్న నలుగురు నిందితులను అరెస్టు చేయడంతో దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ గ్యాంగ్‌ల ఉనికి బయటపడిందని సైబరాబాద్ కమిషనరేట్ పరిధి సైబర్ క్రైం డీసీపీ బి.సాయిశ్రీ తెలిపారు. ఒక ప్రైవేట్ ఉద్యోగి (Private Employee) నకిలీ ట్రేడింగ్ యాప్ స్కాం(Fake Trading App Scam)లో రూ.కోటి వరకు నష్టపోయాడు.
అతని ఫిర్యాదు (Complaint) మేరకు కేసు నమోదు చేశారు. బాధితుడు నకిలీ స్టాక్ ట్రేడిరగ్ యాప్ ద్వారా రూ.21,93.300 కోల్పోయినా కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా మోసం టెలిగ్రామ్(Telegram), వాట్సాప్ (Whatsapp), సోషల్ మీడియా (Social Media) గ్రూప్ ద్వారా నకిలీ ట్రేడింగ్ జరిగిందని గుర్తించారు. హెచ్‌డీఎఫ్‌సీ(Hdfc), ఐసీఐసీ (ICICI) బ్యాంక్ అకౌంట్ నుంచి మొత్తం రూ.21,93,300 అనేక అకౌంట్లకు బదిలీ చేసినట్లు నిర్థారించారు.
వీటిలో రూ.90 వేల బదిలీని నిందితుడి బ్యాంక్ అఔంట్ ద్వారా సాంకేతిక ఆధారాలు సేరించి ఇద్దరు నిందితులను (తుమ్మాలూరు సుధాకర్‌రెడ్డి, తుమ్మాలూరు రఘునాథ్ రెడ్డి) పట్టుకొని వారి నుంచి మొబైల్ ఫోన్లు 5, మొబైల్ వాల్ చార్జర్ 1, స్మార్ట్‌వాచ్ 1, సిమ్‌కార్డులు 6 స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన నలుగురిలో ముగ్గురు ట్రేడిరగ్ ఫ్రాడ్, ఒక స్విపింగ్ మోసం కేసుకు చెందినవారు. సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ 28 కేసుల్లో బాధితులకు రిఫండ్ చేయడానికి న్యాయస్థానం నుంచి మొత్తం రూ.21.98.753 విలువైన 42 రిఫండ్ ఆర్డర్లను విజయవంతంగా పొందింది.
