Wednesday, February 11, 2026
Homeహైదరాబాద్‌BC | బీసీ వాదాన్ని బలపరచండి

BC | బీసీ వాదాన్ని బలపరచండి

జూబ్లీహిల్స్ ఓటర్లకు డాక్టర్ సిహెచ్ భద్ర పిలుపు

తెలంగాణ కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం త్యాగం చేసిన భద్ర

- Advertisement -

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌(Naveen Yadav)కి ఓటేసి గెలిపించాలని ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక తత్వవేత్త, బీసీ సంఘాల జాతీయ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం త్యాగం చేసిన డాక్టర్ సిహెచ్ భద్ర (Ch Bhadra) పిలుపునిచ్చారు. 11వ తేదీన జరిగే ఎలక్షన్‌లో బీసీ బిడ్డ, చదువుకున్న యువకుడు నవీన్ యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని సూచించారు.

ఎర్రగడ్డ డివిజన్ పద్మశాలీల సమ్మేళనంలో మాట్లాడుతూ.. కేసీఆర్ లాంటి నరరూప రాక్షసుణ్ని, బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా సమాధి చేయాలని కోరారు. ఈ మేరకు రాజకీయాలకు, ప్రాంతాలకు, కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఐక్యం కావాలని అన్నారు. మన తరం జ్యోతిబా ఫూలే‌గా పిలుచుకునే చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకుకి మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీ వాదాన్ని బతికించుకొని ప్రజా ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ప్రజలందరూ సపోర్ట్‌గా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ఎన్నికలు బీసీలకు, దొరలకు మధ్య జరుగుతున్న యుద్ధం అని, ఇందులో ప్రతిఒక్కరూ ధర్మం, న్యాయం, సత్యం వైపు, నవీన్ యాదవ్ వైపు ఉండాలని చెప్పారు. నవీన్ యాదవ్ గెలుపు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ గెలుపుగా అభివర్ణించారు. హస్తం గుర్తుకు ఓటు వేయడమంటే ప్రజాస్వామ్యానికి చోటివ్వడం అని భద్ర వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News