Saturday, April 4, 2026
Homeఆరోగ్యంTips | కడుపు ఉబ్బరంగా ఉందా..?

Tips | కడుపు ఉబ్బరంగా ఉందా..?

  • ఇలా చేసి చూడండి ఉపశమనం లభిస్తుంది..
  • ఆహార అలవాట్లు మార్చుకుంటే ఎంతో మంచిది..

క‌డుపు ఉబ్బరం అనేది చాలా మందికి ఏదో ఒక సమయంలో ఎదురయ్యే సాధారణ జీర్ణ సమస్య. ఎక్కువగా తినడం, వేగంగా తినడం, కొన్ని ఆహారాల అసహనం, లేదా జీర్ణ సమస్యలు వంటి రోజువారీ కారణాల వల్ల ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. అప్పుడప్పుడు వచ్చే బ్లోటింగ్‌ సాధారణంగా హానికరం కాకపోయినా, తరచూ ఇబ్బంది పెడితే రోజువారీ జీవనశైలిపై, ఆహార అలవాట్లపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ఆహారం, జీవనశైలిలో కొన్ని చిన్న మార్పులు చేస్తే బ్లోటింగ్‌ను తగ్గించుకోవచ్చ‌ని వైద్యులు తెలియ‌జేస్తున్నారు. బ్లోటింగ్ ను త‌గ్గించే కొన్ని స‌హజ చిట్కాల గురించి వారు వివ‌రిస్తున్నారు.

రోజువారీ ఆహారంలో పుదీనా టీని చేర్చుకోవడం మంచిద‌ని వైద్యులు తెలియజేస్తున్నారు. పుదీనా టీలో ఉండే మెంథోల్ జీర్ణ కండరాలను సడలించడంలో సహాయపడుతుంది. దీంతో కడుపులో ఉన్న గ్యాస్ సులభంగా బయటకు వెళ్లి, ఉబ్బరం, నొప్పి తగ్గుతాయి.అలాగే భోజనం తర్వాత సోంపు గింజలు నమలడం కూడా ఒక సంప్రదాయ పద్ధతి. ఇవి గ్యాస్‌ను బయటకు పంపడంలో సహాయపడుతూ, కడుపు నిండిన భావాన్ని తగ్గిస్తాయి. అలాగే లాక్టోస్ ఇంటోలరెన్స్ ఉందో లేదో తెలుసుకోవడం కూడా అవసరం.

- Advertisement -

పాల పదార్థాలు తీసుకున్న 30 నిమిషాల నుంచి 2 గంటలలో బ్లోటింగ్ లక్షణాలు కనిపిస్తే, అది ఈ సమస్యకు సంకేతం కావచ్చు. దీన్ని గమనించడం లేదా వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించుకోవచ్చ‌ని వైద్యులు సూచిస్తున్నారు. అదే విధంగా కార్బొనేటెడ్ పానీయాల వినియోగాన్ని కూడా చాలా వ‌ర‌కు త‌గ్గించాలి. ఈ పానీయాల్లో ఉండే కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ జీర్ణ వ్యవస్థలో చేరి కడుపులో ఇరుక్కుపోయి అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

ఇక ఫైబర్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, దాన్ని ఒక్కసారిగా ఎక్కువగా తీసుకోవడం జీర్ణాశ‌యానికి ఇబ్బందులు కలిగించవచ్చు. క్రమంగా కొద్ది కొద్దిగా ఫైబర్‌ను పెంచితే జీర్ణవ్యవస్థ అలవాటు పడుతుంది, సమస్యలు తగ్గుతాయి. బ్లోటింగ్ అనేది సాధారణ సమస్య అయినప్పటికీ సరైన ఆహారపు అలవాట్లు, చిన్న జీవనశైలి మార్పులతో దీన్ని సులభంగా నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News