- సందర్శించిన ఎమ్మెల్యే నాగరాజు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో ఎస్సారెస్పీ(Sri Ram Sagar Project) కాలువ గతంలో కబ్జాకు గురైందని మళ్ళీ అదే కాలువలో వేసిన పైపులైన్ తొలగించి ప్రభుత్వాన్ని, అధికారులను తప్పు పట్టిస్తున్నారని స్థానిక సర్పంచ్ తక్కలపల్లి శ్రీనివాస్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కు ఇటివల ఫిర్యాదు చేయగా గురువారం సాయంత్రం స్థానిక సర్పంచ్ తో కలిసి అక్రమంగా తీసిన కెనాల్ కాల్వను వర్థన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు సందర్శించిచారు. సూమారు రెండున్నర ఎకరాల భూమి ఐదు కోట్ల విలువైన ప్రభుత్వ భూమిగా స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉన్నతాధికారులకు చరవాణి ద్వారా సంప్రదించి పూర్తి నివేదిక అందించాలని ఆదేశించగా రెండు మూడు రోజుల్లో పూర్తి వివరాలు అందిస్తామని అన్నారు.

గతంలో కూడా ప్రజావాణి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేయగా పట్టించు కోలేదని ఎమ్మెల్యే అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసారని ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యను లేవనేత్తుతానని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళతానని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, టిపిసిసి లిగల్ అడ్వజర్ నిమ్మాని శేఖర్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పిన్నింటి అనిల్ రావు, ఎస్సై ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ముదురకోల రమేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వడ్లకొండ రమేష్, నీలం శ్రీను, ముదురుకోళ్ళ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
