- కంపెనీ యాజమాన్యం ఆరోపణ
కోర్టు వివాదంలో ఉన్న స్థలంలోకి బుధవారం అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి శ్రీనాథ్ స్పిన్నర్స్ కంపెనీ కార్మికుల పై దాడికి యత్నించారని కంపెనీ యాజమాన్యం మీడియాకు తెలిపారు. మేడ్చల్ డివిజన్ పరిధిలోని శ్రీనాథ్ స్పిన్నర్స్ కంపెనీ కి చెందిన స్థలంపై కొంతకాలంగా కోర్టు వివాదం కొనసాగుతుంది.

బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జేసిబి, టిప్పర్ లారీలతో కంపెనీలోకి ప్రవేశించి ప్రహరీ కంచెను తొలగించి కార్మికుల పై దాడికి యత్నించారని కంపెనీ సిబ్బంది నాగేష్ తెలిపారు. దీనిపై పోలీసులకు పిర్యాదు చేశామని అధికారులు వారిపై చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించాలని కోరారు.

- Advertisement -
