- జిల్లాలో వైద్య సేవల పర్యవేక్షణ బలోపేతం కృషి.
- డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డా,, జి.చంద్రశేఖర్.
జిల్లాలో వైద్య, ఆరోగ్య సేవలు సమర్థవంతంగా ప్రజలకు చేరేందుకు శాఖ నిరంతర చర్యలు తీసుకుంటోందని జిల్లా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ జి.డా,,చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రాల్లోని విద్యానగర్ ఉన్న శ్రీహాన్ లో హాస్పిటల్ పై ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. పెండెం వెంకటరమణ ఆదేశాల మేరకు ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాల్లో అమలు పరచబడుతున్న క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ కార్యకలాపాలు ప్రత్యేక బృందాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అనుమతులులేని డయాగ్నస్టిక్ కేంద్రాలు, నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజల ఆరోగ్య భద్రతకు ఎలాంటి రాజీ లేకుండా తనిఖీలు కొనసాగుతున్నాయని అన్నారు.సూర్యాపేట పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీలు చేశాం అన్నారు. ఆసుపత్రుల్లో అందజేస్తున్న వైద్య సేవలు, లైసెన్సులు, రికార్డులు, సిబ్బంది అర్హతలు, డయాగ్నస్టిక్ యంత్రాల ప్రమాణాలు వంటి అంశాలు పూర్తిగా పరిశీలించినట్టు అధికారులు వెల్లడించారు.ప్రైవేటు రంగంలో వైద్య సేవల నాణ్యతను కాపాడటం శాఖ ప్రధాన లక్ష్యమని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో మాస్ మీడియా అధికారి సంజీవ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
