Sunday, February 15, 2026
HomeసినిమాVishnu Vinyasam | శ్రీ విష్ణు 'విష్ణు విన్యాసం'ఫిబ్రవరి 28న గ్రాండ్ గా రిలీజ్

Vishnu Vinyasam | శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం’ఫిబ్రవరి 28న గ్రాండ్ గా రిలీజ్

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్సయిటింగ్ ఎంటర్‌టైనర్‌ ‘విష్ణు విన్యాసం’తో థియేటర్లలో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయన సారిక కథానాయికగా నటించింది, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించారు.

ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. శ్రీ విష్ణు ఫంకీ ప్రింటెడ్ షార్ట్స్, కలర్ ఫుల్ చొక్కా, షేడ్స్ ధరించిన క్లాసిక్ బైక్‌పై విశ్రాంతి తీసుకుంటున్నట్లు అదిరిపోయే వైబ్ తో కనిపించిన అనౌన్స్మెంట్ పోస్టర్ అదిరిపోయింది.

- Advertisement -

విష్ణు విన్యాసం ఫన్, కలర్ ఫుల్ సినిమాటిక్ రైడ్‌ గా ఉండబోతోంది. శ్రీవిష్ణు విచిత్రమైన నమ్మకాలు, జాతకాలని నమ్మే యువకుడి పాత్రలో అలరించబోతున్నారు

ప్రమోషన్‌లు ఇప్పటికే జోరందుకున్నాయి, టైటిల్ గ్లింప్స్, పెప్పీ ఇంట్రడక్టరీ ట్రాక్. వాలెంటైన్స్ డే రొమాంటిక్ సింగిల్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి రధన్ సంగీతం సమకూరుస్తున్నారు, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు, ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా, కార్తికేయన్ రోహిణి ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో నిర్మాతలు మరింత జోరుగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తారాగణం: శ్రీ విష్ణు, నయన సారిక, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: యదునాథ్ మారుతీ రావు
ప్రొడక్షన్ హౌస్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
నిర్మాత: సుమంత్ నాయుడు జి
సమర్పణ: హేమ & షాలిని
సహ నిర్మాతలు: సుబ్రమణ్యం నాయుడు జి, రామాచారి ఎం
DOP: సాయి శ్రీరామ్
సంగీతం: రాధన్
ఆర్ట్ డైరెక్టర్: ఎ. రామాంజనేయులు
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
కొరియోగ్రఫీ: భాను మాస్టర్
పబ్లిసిటీ డిజైనర్: అనంత్ కంచెర్ల
పీఆర్వో: వంశీ-శేఖర్

- Advertisement -
RELATED ARTICLES

Latest News