Friday, October 3, 2025
ePaper
Homeస్పోర్ట్స్రంగంలోకి స్పోర్ట్స్ సైంటిస్ట్

రంగంలోకి స్పోర్ట్స్ సైంటిస్ట్

ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో నియామకం

సౌతాఫ్రికాకు చెందిన‌ అడ్రియ‌న్‌ లే రౌక్స్‌ను స్పోర్ట్స్ సైంటిస్ట్‌గా పేర్కొంటారు. ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో గొప్ప అనుభవం అతని సొంతం. టీమిండియా ఇంగ్లండ్ టూర్ నేపథ్యంలో అతణ్ని మన జట్టుకు స్ట్రెంత్, కండిష‌నింగ్ కోచ్‌గా బీసీసీఐ నియ‌మించింది. క్రికెట్ గురించి ఏ టూ జెడ్ తెలిసిన అడ్రియ‌న్‌ లే రౌక్స్‌.. ప్లేయర్స్‌ను అన్ని విధాలుగా అంచనా వేయటంలో అందె వేసిన చెయ్యి. ఇతను గ‌తంలోనూ ఇండియన్ టీమ్‌కి స్ట్రెంత్, కండిష‌నింగ్ కోచ్‌గా చేశాడు. ఇప్పుడు మరోసారి అతని సేవలు పొందాలని బీసీసీఐ నిర్ణయించింది.

టీమిండియా క్రికెట‌ర్లు ఫిజికల్‌గా ఫిట్‌నెస్‌తో ఉండేలా చూడటం అడ్రియ‌న్‌ లే రౌక్స్‌ బాధ్యత. లార్డ్స్‌లో టీమిండియా ప్రాక్టీస్ సమయంలో అతను మన ఆట‌గాళ్ల‌కు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చాడు. ఒక్కో ప్లేయ‌ర్‌ను జాగ్ర‌త్త‌గా పరిశీలించి వాళ్ల ప్లస్‌లు, మైనస్‌లు విశ్లేషించటమే అతని కర్తవ్యం. తద్వారా అడ్రియ‌న్‌ లే రౌక్స్‌.. క్రికెట‌ర్లు త‌మ‌ను తాము ఇంప్రూవ్ చేసుకొని మ్యాచ్‌లో మెరికల్లా రాణించడంలో సాయపడతాడు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News