Wednesday, March 4, 2026
Homeస్పోర్ట్స్Sports Courts | వివిధ క్రీడల కోర్టుల ప్రారంభం

Sports Courts | వివిధ క్రీడల కోర్టుల ప్రారంభం

రంగారెడ్డి జిల్లా గండిపేట వద్ద అథ్లెటిక్స్ సొసైటీ(Athletics Society) ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన వివిధ క్రీడల కోర్టులను ఇవాళ శనివారం ప్రారంభించారు. బ్యాట్మింటన్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, పికిల్ బాల్, ప్యాడిల్ టెన్నిస్, స్విమ్మింగ్ తదితర కోర్టులను మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్(V.Srinivas Goud).. టీపీసీసీ అధ్యక్షుడు(Tpcc President), ఎమ్మెల్సీ(MLC) మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), ఎమ్మెల్సీ మల్కా కొమరయ్యతో కలిసి అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా కోర్టుల నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

శ్రీనివాస్ గౌడ్ సరదాగా కొద్దిసేపు క్రికెట్ ఆడారు. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్ చేసి ఉత్సాహపరిచారు. చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మునిసిపాలిటీ అజీజ్ నగర్ గ్రామ సమీపంలోని పల్లవి పాఠశాలలో ఏర్పాటుచేసిన ఈ క్రీడా ప్రాంగణం(Sports Arena) ప్రారంభోత్సవంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఐపీఎస్ మురళి కృష్ణ, పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News