అరుణాచలం చరిత్ర వేద, పురాణాలతో ముడిపడి ఉంది. అరుణాచలేశ్వర ఆలయం శివుడి(Shiva)కి అంకితం. ప్రాచీన కాలం నుంచి చోళులు, విజయనగర రాజులు, పల్లవులు, పాండ్యులు వంటి వివిధ రాజవంశాల వారు అభివృద్ధి చేశారు. ముఖ్యంగా 9వ శతాబ్దంలో చోళులు ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. 30 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద ఆలయ సముదాయంగా మార్చారు. అగ్నిలింగానికి ప్రతీకగా ఉండే అరుణాచల పర్వతం చుట్టూ గిరి ప్రదక్షిణ(Giri Pradakshina) చేయడం గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత(Spiritual Significance)ను సంతరించుకుంది. ఇది మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. స్కంద పురాణం(Skanda Puranam) ప్రకారం శివాజ్ఞతో విశ్వకర్మతో ఆలయాన్ని నిర్మించారు.
గౌతమ మహర్షి(Gautama Maharshi) పూజా విధానాలను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణం చోళులు ప్రారంభించిందే. వారు ఈ ప్రాంతాన్ని శతాబ్దాలుగా పాలించారు. విజయనగర రాజులు ఆలయాన్ని విస్తరించి వేలాది స్తంభాల మండపాన్ని నిర్మించారు. పల్లవులు, పాండ్యులు, హొయసలు వంటివారు కూడా ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారని చరిత్ర చెబుతోంది. ఆలయ నిర్మాణం ప్రాముఖ్యత చూస్తే అరుణాచలేశ్వరుడు ఈ ఆలయాన్ని అగ్ని లింగ రూపంలో శివుడికి అంకితం చేసినట్లు అనిపిస్తుంది. ఇది పంచభూత స్థలాల్లో అగ్ని మూలకాన్ని కలిగి ఉంది. నాలుగు పెద్ద గోపురాలతో దేశంలోని అతిపెద్ద ఆలయాల్లో ఒకటిగా ఉంది.
అరుణాచల పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయడాన్ని (గిరి ప్రదక్షిణను) అత్యంత పవిత్రం(Most Sacred)గా భావిస్తారు. ఇది పాపాలను తొలగించి మోక్షాన్ని ఇస్తుందని నమ్మకం. కార్తీక మాసం(Karthika Masam)లో పౌర్ణమి (Pournami) రోజున కొండపై వెలిగించే దీపం.. కోట్లాది భక్తులను ఆకర్షిస్తుంది. అరుణాచలం కేవలం ఒక క్షేత్రమే కాదు. స్వయంగా శివుడే అని రమణ మహర్షి వంటి యోగులు బోధించారు. ఇక్కడ ఉన్న ప్రతి రాయి, చెట్టు, నీరును పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ నిద్రించడం కూడా సమాధి స్థితికి దారితీస్తుందని పురాణాలు చెబుతాయి. అరుణాచలం గిరి ప్రదక్షిణ అంటే తిరువణ్ణామలైలోని అరుణాచల కొండ చుట్టూ 14 కిలోమీటర్ల దూరం భక్తితో నడిస్తారు.
ఇది ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైంది. పౌర్ణమి రోజుల్లో లక్షలాది మంది భక్తులు చేస్తారు. ఇది మోక్షాన్ని, కోరికలను నెరవేరుస్తుందని నమ్మకం. ఈ ప్రదక్షిణలో అష్టలింగాలను సందర్శించొచ్చు. రమణ మహర్షి ఆశ్రమాన్ని చూడొచ్చు. ఇది సంపూర్ణ భక్తితో, ధ్యానంతో పూర్తిచేయాల్సిన పవిత్ర యాత్ర. అరుణాచలేశ్వర ఆలయం తూర్పు గోపురం వద్ద ప్రారంభించి, పశ్చిమ గోపురం నుంచి బయలుదేరి కొండ చుట్టూ గడియార దిశలో నడవటం, సుమారు 14 కిలోమీటర్లు పూర్తి చేయడానికి 4-6 గంటలు పడుతుంది. పౌర్ణమి రోజున చేయడం చాలా శుభప్రదం. పగటిపూట చేయడం మంచిది. అరుణాచలం కొండ సాక్షాత్తు శివుడి రూపమని నమ్ముతారు.
ఇది సంపూర్ణ భక్తి, సమర్పణ, ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవకాశమిస్తుంది. మోక్షాన్ని ఇస్తుందని, కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసం. అష్ట లింగాల మార్గంలో ఉండే ఎనిమిది లింగాలు.. ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, సూర్య, వాయు, కుబేర, ఈశాన్య లింగాల వద్ద పూజలు చేయడం ఇక్కడి ముఖ్యాంశం. ఈ మార్గంలో రమణ మహర్షి ఆశ్రమం కూడా వస్తుంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు పూర్తిచేయడం మంచిది. అన్ని శివ లింగాలూ ఒకటి కాదు. ఒక్కో లింగానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. అరుణాచలంలో ఉన్న అగ్నిలింగం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు వివరించారు.
శివుణ్ని నమ్మి ప్రదక్షిణ మొదలుపెట్టినవారికి జీవితంలో కావాల్సినవి ఇస్తాడు. మూడో అక్షరం ‘క్షి’ అంటే ఈ జన్మలో అనుభవించాల్సిన పాపాలను ధ్వంసం చేయటం. ఇక నాలుగో అక్షరం ‘ణం’ అంటే అరుణగిరి ప్రదక్షిణం చేసినవాడికి పాపం పుణ్యం ఉండదు. కనుక వాడు మోక్షానికి అధికారి అవుతాడు. అరుణాచలంలో అగ్నిలింగం ఉంటుంది. పేరును బట్టి ఆలోచిస్తే అగ్నిలింగం దగ్గర అగ్నిహోత్రం ఉండాలి. కానీ.. అరుణాచలంలో శివలింగ దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్నిహోత్రం కనిపించదు. అలాంటప్పుడు దాన్ని అగ్నిలింగం అని ఎదుకు పిలుస్తారనే సందేహం కలగొచ్చు.
అక్కడ రాశీభూతమైన జ్ఞానాగ్ని ఉంది. అందుకే మన పెద్దలు జీవ కోటి యాత్రలో ఒక చోట అడ్డంగా గీత ఉంటుందని చెబుతారు. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశానికి ముందు గడిపిన జీవిత యాత్ర. ఆ గీతకు తరువాతది అరుణాచల ప్రవేశం జరిగిన తరువాతి జీవయాత్ర. అరుణాచలంలో అంతరాలయంలోని శివ లింగానికి కొంచెం దగ్గరగా కూర్చుంటే ఉక్కపోసేసి చెమటలు పట్టేసి వేడితో సతమతమయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఒకానొకప్పుడు శంకరుడు మానవులకు నాలుగు వరాలిచ్చాడు. వాటిలో మొదటిది.. ‘దర్శనాత్ అభ్రశదసి’. చిదంబరంలో పరమేశ్వరుడి జ్ఞానంతో దర్శించటం.
ఇది కుదరకపోతే ‘జననాత్ కమలాలయే’. కమలాలయే అంటే తిరువారూర్. అక్కడ పుడితే మోక్షం లభిస్తుంది. కానీ పుట్టడం మన చేతుల్లో లేదు కదా. అందువల్ల ‘కాశ్యాంతు మరణాన్ ముక్తిహి కాశీ’. వారణాసిలో ప్రాణం వదిలి పెట్టేస్తే మోక్షం ఇచ్చేస్తానన్నాడు. మరణం కూడా మన చేతుల్లో ఉండదు. అందువల్ల ‘స్మరణాత్ అరుణాచలే’ అన్నాడు. అరుణాచల శివుడిని తలుచుకుంటే పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు. అరుణాచల క్షేత్రం అంత గొప్పది. ఆ పేరెలా వచ్చింది?. అచలం అంటే కొండ. ఆ కొండకు ప్రదక్షిణం చెయ్యాలంటే 14 కిలో మీటర్లు నడవాల్సి ఉంటుంది.
ఆ కొండ కింద ఉన్నభాగాన్ని అరుణాచల పాదాలని పిలుస్తారు. అక్కడికి వెళ్లిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణం చేస్తారు. అక్కడ ఈ కొండకి ప్రదక్షిణం చేస్తే కోట్ల జన్మల్లో చేసిన పాపాలన్నీ దగ్ధమవుతాయి. భగవాన్ రమణులను చూడటానికి ఎవరైనా అరుణాచలం వెళ్తే ఆయన మొదటగా ‘గిరి ప్రదక్షిణం చేశారా?’ అని అడిగేవారు. ప్రదక్షిణానికి ఆయన ఒక నిర్వచనం చెప్పేవారు. ప్రదక్షిణంలో మొదటి అక్షరం ‘ప్ర’ అంటే సమస్త పాపరాశిని ధ్వంసం చేయటం. ‘నేను అరుణగిరికి ప్రదక్షిణ చేయడానికి బయలుదేరుతున్నాను’ అని ఈశ్వరునికి నమస్కరించి మొదటి అడుగు తీసి ఇలా వెయ్యగానే పాపరాశి ధ్వంసమవుతుంది.
రెండో అక్షరం ‘ద’ అంటే కోరికలు తీర్చటం. శివుణ్ని నమ్మి ప్రదక్షిణం మొదలుపెడితే వారికి జీవితంలో కావాల్సినవి ఇస్తాడు. మూడో అక్షరం ‘క్షి’ అంటే ఈ జన్మలో అనుభవించాల్సిన పాపాలను ధ్వంసం చేయటం. ఇక నాలుగో అక్షరం ‘ణం’. అరుణగిరికి ప్రదక్షిణం చేసిన వాడికి పాపం పుణ్యం ఉండదు కనుక వాడు మోక్షానికి అధికారి అవుతాడు. గిరి ప్రదక్షిణం అనేది మనం అక్కడ ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి. అరుణ పర్వతానికి మీరు ఎన్నిమార్లు ప్రదక్షిణం చేసినా ఒక్క పర్వతానికే చేయకూడదు. పర్వతానికి చుట్టూ ఉన్న అన్ని ఆలయాలను దర్శనం చేస్తూనే ప్రదక్షిణం చేయాలి.
గిరి ప్రదక్షిణానికి బయలుదేరినప్పుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనబడే లింగం యమలింగం. దక్షిణ దిక్కు యమధర్మరాజు ఉంటాడు. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహంతో ఆయువు వృద్ధి అవుతుంది. ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్లేటప్పటికి అక్కడ నైరుతి లింగం ఉంటుంది. అది రోడ్డు మీదికి కనపడదు. రోడ్డుకి కాస్త లోపలికి ఉంటుంది. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమో, ఒక శ్లోకమో, పద్యమో, శివ సందర్భమో చెప్పుకోవాలి. ఇక ఉత్తర దిశగా ఉన్నది కుబేర లింగం. ఇక్కడ ప్రార్థన చేస్తే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.
- కామిడి సతీష్ రెడ్డి
