- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు..జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఇల్లందు కోర్టు నందు ఇల్లందు మండలం న్యాయ సేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమానికి ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ వారు మాట్లాడుతూ సమాజంలో దివ్యాంగులను చిన్నచూపు చూసే ధోరణిని ఉందని ఆ ధోరణిని మార్చుకోవాలని వారికి కూడా ప్రత్యేక చట్టాలు ఉంటాయని, చదువు , ఉద్యోగాల భర్తీ, పనిచేసే విషయంలో వారికి కూడా సమాన హక్కులు ఉంటాయని, దివ్యాంగులకు ఉద్యోగ నోటిఫికేషన్లో కోట ఉంటుందని, సొంత తెలివితేటలతో ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే తక్కువ వడ్డీతో బ్యాంకుల ద్వారా రుణాలు పొందవచ్చని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సేతు యాప్ అనే ప్రత్యేక యాప్ ను ఏర్పాటు చేసినారు.

ఈ యాప్ ద్వారా చదువుకున్న దివ్యాంగులు వారి సర్టిఫికెట్లు అప్లోడ్ చేసుకొని ఉద్యోగ నోటిఫికేషన్లు కోసం సులభంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుందని, ఈ యాప్ గురించి అవగాహన లేని దివ్యాంగులు దగ్గర్లో ఉన్న మీసేవ కేంద్రాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని వెసులు బాటు ఉంటుందని, ఈ సందర్భంగా తెలిపినారు. అనంతరం జడ్జి గారి చేతుల మీదుగా ఇల్లందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులను శాలువాతో సత్కరించి, వారికి పండ్లు ఫలాలు అందించినారు. ఈ కార్యక్రమంలో జడ్జి గారితో పాటు ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాంపెల్లి ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కీర్తి కార్తిక్, సీనియర్, జూనియర్, న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
