Wednesday, February 18, 2026
HomeజాతీయంOm Birla | లోక్‌సభలో ఇ-సిగరెట్ల వాడకం

Om Birla | లోక్‌సభలో ఇ-సిగరెట్ల వాడకం

స్పీకర్ ఓం బిర్లా సీరియస్

లోక్‌సభ(LokSabha)లో ఇ-సిగరెట్(E-Cigarette) వాడకంపై చర్యలు తప్పవని స్పీకర్(Speaker) ఓం బిర్లా హెచ్చరించారు. పార్లమెంట్(Parliament) పవిత్రతను దెబ్బతీసే హక్కు ఏ సభ్యుడికీ లేదని, మర్యాదను కాపాడుకోనివారు సభ్యత్వాన్ని కోల్పోవడం(Loss Of Membership) వంటి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని సీరియస్‌గా చెప్పారు. పార్లమెంట్ గౌరవాన్ని కాపాడుకోవడంలో రాజీపడలేమని స్పష్టం చేశారు. తృణమూల్ కాంగ్రెస్(TMC) పార్టీ సభ్యుడొకరు సభలో ఇ-సిగరెట్‌ను బహిరంగంగా ఉపయోగిస్తున్నారని బీజేపీ ఎంపీ(BJP MP) అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఇ-సిగరెట్లను దేశవ్యాప్తంగా నిషేధించినప్పటికీ అవి అతని చేతికి ఎలా వచ్చాయోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. ఈ అంశంపై దర్యాప్తు జరుగుతోందని, తదుపరి చర్య కోసం తగిన సభా కమిటీకి నివేదిస్తామని తెలిపారు. సభా కమిటీ సిఫారసు మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News