Friday, September 12, 2025
ePaper
spot_img
Homeజాతీయంమళ్లీ పుంజుకున్న నైరుతి

మళ్లీ పుంజుకున్న నైరుతి

దాదాపు 19 రోజులు నిలిచిపోయిన నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు పుంజుకున్నాయి. మధ్య, ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్‌, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మధ్య, ఉత్తర మహారాష్ట్ర, తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న రెండు మూడు రోజుల్లో గుజరాత్‌, మహారాష్ట్ర, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లోనూ విస్తరించనున్నాయి.

గుజరాత్‌ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా మారనుంది. వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలో నిన్న పలు చోట్ల వర్షాలు కురవగా.. రానున్న 24 గంటల్లో అక్కడక్కడా వానలు పడతాయని తెలిపింది.

నైరుతి రుతుపవనాలు నిన్నటికి మహారాష్ట్ర మొత్తం వ్యాపించి పొరుగున ఉన్న గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లోకి కూడా ప్రవేశించాయి. సాధారణంగా జూన్‌ ఒకటిన కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఈ ఏడాది షెడ్యూల్‌ కన్నా ముందే మే నెల 24న పలకరించాయి. అనంతరం దక్షిణ, ఈశాన్య, పశ్చిమ భారతంలోకి ప్రవేశించాయి. ఉన్నట్టుండి మే నెల 29 నుంచి స్తబ్దత నెలకొన్న రుతుపవనాలు ఎట్టకేలకు వేగం పుంజుకున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News