Wednesday, April 1, 2026
Homeఆదిలాబాద్Sanitation | చెత్తతో కూరుకుపోయిన సోఫీ నగర్…

Sanitation | చెత్తతో కూరుకుపోయిన సోఫీ నగర్…

  • మున్సిపల్ నిర్లక్ష్యంతో అస్తవ్యస్తమైన నిర్మల్ శివారు కాలనీలు…

నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ సహా పలు శివారు కాలనీలలో పరిశుభ్రత పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తోంది. డ్రైనేజీలు చెత్త చెదారంతో నిండిపోవడంతో దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. కాలనీలలో ఎక్కడ చూసినా చెత్త గుట్టలు పేరుకుపోయి ప్రజల జీవనాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రోజువారీగా తీసుకెళ్లాల్సిన తడి, పొడి చెత్తను మున్సిపల్ కార్మికులు సక్రమంగా సేకరించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డ్రైనేజీలలో పేరుకుపోయిన మురుగు, చెత్త కారణంగా దోమలు విపరీతంగా పెరిగి వ్యాధుల భయం నెలకొంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతారనే ఆందోళన స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతోంది. కాలనీలలో పరిశుభ్రత లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

- Advertisement -

మున్సిపల్ అధికారులు సమస్యలను పట్టించుకోవడం లేదని, పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. పన్నులు క్రమంగా చెల్లిస్తున్నప్పటికీ మౌలిక సదుపాయాలు అందకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా మున్సిపల్ శాఖ స్పందించి కాలనీలలో చెత్తను తొలగించి, డ్రైనేజీలను శుభ్రం చేసి, చెత్త సేకరణను క్రమబద్ధీకరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పరిస్థితి మరింత విషమించి ప్రజా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News