హైదరాబాద్: కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పి.సి. ఘోస్ కమిషన్ నివేదిక ఆధారంగా సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌పై(Smita Sabharwal) ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు గురువారం నాడు ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కమిషన్ తనపై చేసిన ప్రతికూల వ్యాఖ్యలను కొట్టివేయాలని కోరుతూ స్మితా సబర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ముఖ్య న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్, ఈ పిటిషన్‌ను ఇప్పటికే కోర్టులో పెండింగ్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్ రావు, మరియు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషిల పిటిషన్లతో కలిపి విచారిస్తామని తెలిపింది. ఈ ముగ్గురికి కూడా ఇదే కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోకుండా కోర్టు ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్‌పై(Smita Sabharwal) కమిషన్ తన నివేదికలో ప్రతికూల వ్యాఖ్యలు చేసింది. అయితే, కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ లోని సెక్షన్ 8-B, 8-C ప్రకారం తప్పనిసరిగా పాటించాల్సిన ముందస్తు నోటీసు ఇవ్వడం మరియు వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించడం వంటి నిబంధనలను కమిషన్ పాటించలేదని ఆమె ఆరోపించారు. మూడు బ్యారేజీల నిర్మాణానిపై తీసుకున్న నిర్ణయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అలాగే అనుమతులు మంజూరు చేయడంలో తనకు ఎలాంటి పాత్ర లేదని స్మితా సబర్వాల్ స్పష్టం చేశారు.
మరిన్ని వార్తలు :