తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా సోమవారం బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎంపీ(Brs Party Former Mp) సంతోష్ కుమార్(Santosh Kumar)కి ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) నోటీసులు జారీ చేసింది. రేపు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తమ ఎదుట విచారణకు హాజరుకావాలని పేర్కొంది. కాగా.. ఇప్పటికే ఈ వ్యవహారంలో మాజీ మంత్రి, సిద్దిపేట్ ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao)ను, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR)ను సిట్ విచారణ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా.. సిట్ నోటీసులపై సంతోష్ కుమార్ స్పందించారు. చట్టాన్ని గౌరవిస్తానని, ఎంక్వైరీకి హాజరై సిట్‌కు సహకరిస్తానని చెప్పారు. ఈ కేసులో అందరూ ఊహించినట్లుగానే సంతోష్ కుమార్‌కి సిట్ పిలుపు అందింది. ఈయన తర్వాత కేసీఆర్‌కి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
Phone Tapping Case | సంతోష్ కుమార్‌కి సిట్ పిలుపు
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
