- ఎస్ఐ సొంత నిధులతో గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు
శాంతి భద్రతలో పాటు సామాజిక సేవలు చేస్తూ హత్నూర మండలం ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తన ఔన్నత్యం చాటుకుంటున్నారు. హత్నూర గ్రామం నుండి దౌల్తాబాద్ వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలు పడటంతో వాహనదారులు ప్రమాదాలకు గురైతున్నారు.ఇటీవల గుంతల కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటనతో స్పందించిన హాత్నూర మండలం ఎస్ఐ శ్రీధర్ రెడ్డి రహదారి మరమ్మతులకు పూనుకున్నారు.ప్రభుత్వం రోడ్డు మరమ్మతులు చేసే వరకు మరెన్ని ప్రాణాలు పోతాయో అని తన సొంత నిధులతో రోడ్డుపై పడిన గుంతల రోడ్డును మరమ్మతు చేయిస్తున్నారు.తాను స్వయంగా దగ్గర ఉండి రోడ్డు మరమ్మతులు చేయించారు.పోలీసులు అంటే కేవలం శాంతి భద్రతలే కాదని, సామాజిక బాధ్యత గల వారని ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తన సేవా కార్యక్రమాలతో నిరూపించారని పలు వాహనదారులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
