- స్టేషన్కు వచ్చిన మహిళను బెదిరించిన వైనం
- కన్నీరు పెట్టుకున్న బాధిత మహిళ
- చెల్లి, అక్కపై ఫిర్యాదు చేసిన ఘటనలో ఎస్ఐ జోక్యం
- ముక్కు నేలకు రాయించి, మోకాళ్ల మీద కూర్చోబెడతానంటూ వార్నింగ్
- పలువురు ఫిర్యాదుదారులనూ ఇలాగే భయపెడుతున్నట్లు ఆరోపణలు
సూర్యాపేట ప్రతినిధి: కొందరు పోలీసులు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రభుత్వం (Government) అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజల(Public)తో మమేకమై ఫ్రెండ్లీ పోలీస్ (Friendly Policing) విధానాన్ని ప్రవేశపెట్టింది. కానీ సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్(Suryapet Town Police Station)లో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్ఐ ఓవరాక్షన్‌తో ఆ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులను (Complainants) హడలెత్తిస్తున్నారు. ప్రజలకు అండగా ఉండాల్సిన ఎస్ఐ.. స్టేషన్ కు వచ్చిన మహిళల(Ladies)పై అసభ్య పదజాలం వాడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మొన్న రాత్రి కొత్త బస్టాండ్ వద్ద అక్కాచెల్లెళ్ల మధ్య జరిగిన గొడవపై చెల్లెలు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
మోకాళ్ల మీద కూర్చోబెడతా
చెల్లి అక్కపై ఫిర్యాదు చేయడంతో శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అక్క రోహిణి.. స్టేషన్లో ఉండగా అక్కడే ఉన్న ఎస్ఐ సురేష్ కుమార్ మహిళతో మాట్లాడుతూ.. గొడవ ఎందుకు అయిందని అడగడంతో, ఆ మహిళతో ఆమె మా బాబాయ్ కూతురు మా బాబాయ్ ఐదేళ్ల క్రితమే కూతుర్ని వదిలేయడంతో మా వద్దే పెంచుకున్నామని చెబుతున్న క్రమంలో, నువ్వు ఆమెను సాధినవా? నీ ఏజ్ ఎంత? ఆమె ఏజ్ ఎంత.? అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ నువ్వేమైనా ఆమెకు పెళ్లి చేశావా? అంటూ దురుసుగా ప్రవర్తించారని, సార్ ఫిర్యాదు చేసిన వాళ్లను కూడా పిలిపించండి వాళ్ల ముందే నేను మాట్లాడతాను అని రోహిణి ఎస్ఐతో చెప్పినా వినకుండా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ముక్కు నేలకు రాయిస్తా, మోకాళ్ల మీద కూర్చోబెడతా ఏమనుకుంటున్నావో నీ సంగతి చూస్తా అంటూ మహిళతో ఎస్సై దురుసుగా ఉండడమే కాకుండా మహిళ అనే భావన లేకుండా అసభ్య పదజాలాన్ని ఉపయోగించారంటూ ఆ మహిళ కంటతడి పెట్టుకున్నారు.
పలుమార్లు అదే తీరు
పోలీసులు రక్షకులు అనే భావనతో స్టేషన్‌కి వచ్చిన తమకు ఇలాంటి అనుభవం ఎదురవడం చూసి తీవ్ర మనస్థాపానికి గురయ్యామని బాధితులు తెలిపారు. ఇది ఒక్కసారి జరిగిన వ్యవహారం కాదని, ఇదే స్టేషన్‌లో ఇదే ఎస్ఐ ఇలా ప్రవర్తించడం ఇది నాలుగోసారి అని వారు ఆరోపిస్తున్నారు. మహిళలతో పాటు గతంలో వచ్చిన మరికొంత మంది ఫిర్యాదుదారులు కూడా ఇదే తరహా ఆరోపణలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. సంబంధంలేని కేసుల్లో కూడా ఈ అధికారి తలదూర్చి, దురుసుగా ప్రవర్తించే ఘటనలు ఉన్నాయని వారు వెల్లడించారు.
ఎస్సై ప్రవర్తన తీరుపై మహిళలు జిల్లా ఎస్పీని, ఐజిపికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎస్ఐ సురేష్ కుమార్ ప్రవర్తనపై పలువురు పిర్యాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీస్ అధికారులే బెదిరింపులకు పాల్పడటం దారుణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై సూర్యాపేట పట్టణ సీఐ వెంకటయ్యను ఫోన్ ద్వారా వివరణ కోరగా అందుబాటులోకి రాలేదు.
