Saturday, October 4, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుసీఎం బందోబస్తుకు వెళ్తున్న ఎస్‌ఐ ఆత్మహత్య

సీఎం బందోబస్తుకు వెళ్తున్న ఎస్‌ఐ ఆత్మహత్య

ముఖ్యమంత్రి చంద్రబాబు పెనుగొండ పర్యటనకు వెళ్తూ ఓ వీఆర్‌ ఎస్సై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు గ్రామీణ పీఎస్‌లో వీఆర్‌లో ఉన్న ఎస్‌ఐ ఏజీఎస్‌ మూర్తి స్టేషన్‌లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఎం చంద్రబాబు శుక్రవారం పెనుగొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వీఆర్‌లో ఉన్న మూర్తికి బందోబస్తు విధులు అప్పగించారు. నిన్న భీమవరం డిపో నుంచి తుపాకీ తెచ్చుకుని తణుకు గ్రామీణ పీఎస్‌కు రిపోర్టు చేయడానికి వచ్చాడు. అయితే శుక్రవారం ఉదయం స్టేషన్‌లో వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్దం రావడంతో స్టేషన్‌లో ఉన్న సిబ్బంది అప్రమత్తమై అక్కడికి చేరుకుని పరిశీలించగా అప్పడికే ఆయన మృతి చెందాడు. గత కొన్ని రోజుల క్రితం ఎస్సై మూర్తిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ చేసి వీఆర్‌లో ఉంచారు. ఎస్సై ఆత్మహత్య విషయం తెలుసుకున్న జిల్లా పోలీసు అధికారులు విచారం వ్యక్తం చేశారు. తణుకు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News