Saturday, February 21, 2026
Homeరంగారెడ్డిJayanti | చరిత్రలో గొప్ప స్ఫూర్తిదాయకమైన వ్యక్తి శివాజీ.

Jayanti | చరిత్రలో గొప్ప స్ఫూర్తిదాయకమైన వ్యక్తి శివాజీ.

  • నందిగామ సిఐ ప్రసాద్.
  • విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల బహుకరణ.
  • నందిగామలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక గొప్ప యోధుడు, భారతదేశ చరిత్రలో ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని నందిగామ సిఐ ప్రసాద్ పేర్కొన్నారు.నందిగామ మండల కేంద్రంలో శివాజీ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో గురువారం ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద శివాజీ యూత్ అధ్యక్షుడు చించెట్టి శివ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో శివాజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ జయంతి వేడుకలకు నందిగామ సిఐ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఎన్నో మలుపులు, విజయాలతో ముందుకు సాగిందన్నారు. ఆయన చిన్నప్పటి నుంచే అన్యాయాన్ని ఎదిరించే తత్వం అలవర్చుకున్నాడని అన్నారు.తండ్రి షాజీ బోస్లే మరియు తల్లి జిజాబాయి ఆయనకు దేశభక్తిని మరియు ధైర్యాన్ని బోధించారని, తన స్నేహితులు మరియు సైనికులతో కలిసి మొఘల్ సామ్రాజ్యంపై గెరిల్లా యుద్ధాలు చేశారన్నారు. యుద్ధాలలో గెలిచి,అనేక కోటలను స్వాధీనం చేసుకొని మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారని తెలిపారు.

- Advertisement -

ఆయన పరిపాలనలో ప్రజల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని, శివాజీ సేవలను కొనియాడారు.అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను వితరణ చేశారు.అంతకుముందు గ్రామంలోని పుర వీధులగుండా ర్యాలీ నిర్వహిస్తూ, నినాదాలు చేశారు.

ఈ వేడుకల్లో సర్పంచ్ కొమ్ము కృష్ణ,మాజీ ఎంపిటిసిలు చంద్రపాల్ రెడ్డి,కుమారస్వామి,ఉప సర్పంచ్ ఎర్ర వెంకటేష్,పంచాయతీ పాలకవర్గం సభ్యులు,శివాజీ యూత్ క్లబ్ సభ్యులు శ్రీహరి గౌడ్,సంతోష్ కుమార్,ఆర్. రమేష్ రెడ్డి,సార రవికుమార్,బోర్ర ఆంజనేయులు (బంటు), వెంకటేష్ గౌడ్,చంద్రశేఖర్,చంద్రశేఖర్ రెడ్డి,సి యాదయ్య,డాక్టర్ రవి కుమార్,బోర్ర రమేష్ గౌడ్, బంగారం,యాదయ్య, ప్రధానోపాధ్యాయులు సుధాకర్, రత్నయ్య ,పిఈటి శ్రీనివాస్,యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News