యువత శివాజీ వంటి వీరుల స్ఫూర్తితో ముందుకు సాగాలని, చత్రపతి శివాజీ ధైర్య సాహసాలు దేశభక్తి నేటి తరానికి ఆదర్శమని జవహర్ నగర్ అడ్మిన్ ఎస్ఐ రాము నాయక్ తెలిపారు. చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను పురస్కరించుకొని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవహర్ నగర్ చంద్రపురి కాలనీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫేస్ 1 వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ అడ్మిన్ ఎస్ఐ రాము నాయక్ హాజరై శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి వందనం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ శివాజీ ధైర్యసాహసాలు దేశభక్తి నేటి యువతరానికి మార్గదర్శకమని, హిందూ స్వరాజ స్థాపన కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు.

యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా శివాజీ వంటి వీరుల స్ఫూర్తితో సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. శివాజీ మహారాజ్ కేవలం ఒక రాజు మాత్రమే కాదని, ధర్మాన్ని రక్షించిన గొప్ప వీరుడని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మాజీ సర్పంచ్ కారంగుల శంకర్ గౌడ్, నాయకులు రంగుల హరి, బూడిద వెంకటేష్, బాచుపల్లి రమేష్ చారి, అంబాల విష్ణు, ఆర్సీ శ్రీకాంత్, కుమ్మరి కృష్ణ, కత్తెర్ల కిరణ్ యాదవ్, మూకర రవి, రంగుల హరికృష్ణ, ఎం లక్ష్మీనారాయణ, రంగుల శంకర్, కొండ్రతి నరేష్, కోట సంతోష్ కుమార్, రఘు, నగేష్, సుజాత, జ్యోతి, శ్రీకాంత్, చంద్రయ్య, సతీష్ యాదవ్, బసవరాజు, ఎర్ర వెంకటేష్, వంశీ, మహేందర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
