Wednesday, March 4, 2026
Homeరంగారెడ్డిDevelopment | అభివృద్ధి పనులు చిరకాలం గుర్తుండిపోవాలి.

Development | అభివృద్ధి పనులు చిరకాలం గుర్తుండిపోవాలి.

  • షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.
  • చేగూర్ సర్పంచ్,వార్డు సభ్యులను సన్మానించి, అభినందించిన ఎమ్మెల్యే.

గ్రామాల్లో చేసే అభివృద్ధి చిరకాలం ప్రజలకు గుర్తుండేలా చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. నందిగామ మండల కేంద్రంలో చేగూర్ గ్రామంలో గెలిచిన సర్పంచ్ మంకాల శ్రీశైలం,ఉప సర్పంచ్ అవులమంద శివశంకర్, వార్డు సభ్యులను ఎమ్మెల్యే సన్మానించి,అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, మీరు చేసే అభివృద్ధి చిరకాలం గుర్తుండిపోయేలా చేయాలని వారికి పలు సూచనలు,సలహాలను అందించారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాల మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, మండలం పార్టీ అధ్యక్షుడు జంగ నర్సింహా, చేగూర్ వార్డు సభ్యులు మాన్క స్వాతి సురేష్ యాదవ్, ⁠కావలి అర్చన భీమయ్యయాదవ్, మంచనపల్లి భాస్కర్ గౌడ్,సోలిపేట విఘ్నేశ్వరిశ్రీను గౌడ్,మహమ్మద్ ఖలీద్,పబ్బె పూజిత ప్రవీణ్,గునుగుర్తి రాజశేఖర్,బీరెడ్డి రాయపు రెడ్డి,పిఎసీఎస్ డైరెక్టర్ సియెట్ మర్రెడ్డి,మాజీ ఎంపీటీసీ దేపల్లి కుమార్,నాయకులు తుమ్మల నర్సింహ,బొర్ర ప్రవీణ్ రెడ్డి, ఎలికట్టే కృష్ణయ్య,పబ్బె నరేందర్, దరూర్ సతీష్ పటేల్, మంచనపల్లి అంజం,రాజు రెడ్డి,మహమ్మద్ అజార్,మాన్క సురేష్,కావలి భీమయ్య, సోలిపేట శ్రీను,పబ్బె ప్రవీణ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News