- 7 నుంచి 18కు విస్తరణ
జీహెచ్ఎంసీ పరిధిని 150 డివిజన్ల నుంచి 300కు విస్తరించే ప్రభుత్వ నిర్ణయంతో శేరిలింగంపల్లి – చందానగర్ జంట సర్కిళ్ల భౌగోళిక స్వరూపం పూర్తిగా మారింది. ఈ మేరకు విడుదలైన గెజిట్ నోటిఫికేషన్‌పై సూచనలు, అభ్యంతరాల కోసం ప్రజలకు వారం రోజుల గడువు కల్పించారు. గతంలో శేరిలింగంపల్లి సర్కిల్‌లో 3, చందానగర్ సర్కిల్‌లో 4 – మొత్తం 7 డివిజన్లు ఉండగా, ఇప్పుడు 11 కొత్త డివిజన్లను జోడించి మొత్తం 18 డివిజన్లుగా విస్తరించారు.
ప్రస్తుత – కొత్త డివిజన్లు
గతం:
గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, హఫీజ్‌పేట్, మియాపూర్, చందానగర్.
కొత్తవి:
నల్లగండ్ల, మసీద్‌బండా, శ్రీరామ్‌నగర్, అంజయ్యనగర్, హైటెక్ సిటీ, ఇజ్జత్‌నగర్, మాతృశ్రీ నగర్, మదినగూడ, దీప్తిశ్రీనగర్, బీకే ఎంక్లేవ్, మయూరినగర్.
ఈ 18 డివిజన్ల కొత్త హద్దులను ప్రభుత్వం గెజిట్ రూపంలో వెల్లడించింది.
