ఇన్‌ఫ్లుయెన్సర్(Influencer) అవధూత్ సాఠే(Avadhut Sathe)పై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (Sebi) చర్యలు చేపట్టింది. అనుమతి లేకుండా ట్రేడింగ్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్(Trading Academy Private Limited)ను నిర్వహిస్తున్నారని ఆరోపించింది. ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోకుండా ఇన్వెస్ట్‌మెంట్స్ (Investments) సలహాలు సూచనలు ఇచ్చే బిజినెస్ చేస్తున్నారని తప్పుపట్టింది.
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేవరకు రూ.546 కోట్లు ఫ్రీజ్ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. ముంబైకి చెందిన ఇతను ఇంజనీరింగ్ చదివి విదేశాలకు వెళ్లి దాదాపు 35 ఏళ్లుగా ట్రేడింగ్ చేస్తున్నాడు. ఏడేళ్ల కిందట ఇండియాకి తిరిగొచ్చి పూర్తిగా ట్రేడింగ్‌పైనే ఫోకస్ పెట్టారు. ఇతరత్రా కార్యకలాపాలనూ నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. ట్రైనింగ్‌లకు తీసుకునే ఫీజుల ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు.
