ముత్యాలమ్మ తల్లి ఆలయ ద్వితీయ వార్షికోత్సవంలో నేతల వెల్లడి
జవహర్ నగర్, జనవరి 23(ఆదాబ్ హైదరాబాద్): గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(GHMC) పరిధి జవహర్ నగర్ (Jawahar Nagar) దివ్యాంగుల 28వ డివిజన్ మదర్ థెరిస్సా కాలనీలోని ముత్యాలమ్మ తల్లి ఆలయ(Muthyalamma Thalli Temple) ద్వితీయ వార్షికోత్సవాన్ని(Second Anniversary) అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ బూడిద వెంకటేశ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. కాలనీవాసులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ తొలి మేయర్ మేకల కావ్య, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, యువజన విభాగం అధ్యక్షుడు భార్గవ్ రామ్, సీనియర్ నాయకుడు రాజశేఖర్ హాజరయ్యారు. నాయకులు బండకింది ప్రసాద్ గౌడ్, బాచుపల్లి రమేష్ చారి, ఎల్లస్వామి, నర్సింహ, మహేందర్ యాదవ్, భక్తులు, కాలనీవాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తిమార్గమే మానసిక ప్రశాంతతకు నిలయమని నాయకులు తెలిపారు. ముత్యాలమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
