Wednesday, March 4, 2026
Homeబిజినెస్SEBI | ఫిన్‌ఫ్లుయెన్సర్ల లక్ష వీడియోల తొలగింపు

SEBI | ఫిన్‌ఫ్లుయెన్సర్ల లక్ష వీడియోల తొలగింపు

ఆర్థిక సలహాదారులుగా ప్రభుత్వ గుర్తింపు లేకుండా కొంత మంది సోకాల్డ్ ఫిన్‌ఫ్లుయెన్సర్లు(Socalled Finfluencers) ప్రజలకు స్టాక్ టిప్స్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దాదాపు లక్ష వీడియోలను తొలగించినట్లు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(Securities and Exchange Board of India) చైర్మన్(Chairman) తుహిన్ కాంత పాండే(Tuhin Kanta Pandey) చెప్పారు. ఇలాంటి వీడియోలను గుర్తించేందుకు సుదర్శన్(Sudarshan) అనే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మోడల్‌(Artificial Intelligence Model)ను రంగంలోకి దింపామని తెలిపారు. స్టాక్ మార్కెట్ రూల్స్ పాటించకుండా, అనధికారికంగా పెట్టుబడి సలహాలు ఇస్తున్నవారిని గుర్తించి కఠిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. సెబీ సభ్యులు, అధికారులతో కూడిన పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశాలను సమీక్షిస్తున్న ఉన్నత స్థాయి కమిటీ స్థితిపై మాట్లాడుతూ.. 2025 డిసెంబర్‌లో జరిగిన సమావేశంలో బోర్డు ఈ విషయాన్ని చర్చించిందని, మరిన్ని చర్చలు అవసరమని నిర్ణయించిందని పాండే అన్నారు. విస్తృత కోణంలో బహిరంగంగా వెల్లడించడం పరంగా ఎదురయ్యే కొన్ని సమస్యలను సభ్యులు లేవనెత్తారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News