Friday, April 3, 2026
HomeసినిమాSDT-19 | సాయి దుర్గా తేజ్ SDT19 మూవీ అనౌన్స్‌మెంట్

SDT-19 | సాయి దుర్గా తేజ్ SDT19 మూవీ అనౌన్స్‌మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ #SDT19 ఊహకు అందని స్థాయిలో రూపొందుతోంది. గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం అనౌన్స్మెంట్ సినీ ప్రియుల్లో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

SDT19 సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో ఒక పవర్ ఫుల్ ఫేజ్ కి నాంది పలుకుతోంది. విభిన్నమైన కథలతో ముందుకు సాగుతున్న ఆయన ‘యుగాలుగా బయటకు రాని రహస్యాలు, ఊహకు అందని శక్తులు’ చుట్టూ తిరిగే ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్టు ఫస్ట్ పోస్టర్ సూచిస్తోంది.

దర్శక ద్వయం సుజిత్ & సందీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరు “క” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. #SDT19తో వీరి విజన్ మరింత విస్తరించబోతోందని స్పష్టంగా కనిపిస్తోంది. మిథిక్ సై-ఫై (Mythic Sci-fi) నేపథ్యంలో హై-ఆక్టేన్ కథనాన్ని మిళితం చేస్తూ, గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతున్నారు.

- Advertisement -

ఈ భారీ ప్రాజెక్ట్‌ను సాహు గారపాటి తన షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ నిర్మాణ సంస్థ, మరోసారి ఒక డిఫరెంట్, అంబిషస్ కాన్సెప్ట్‌తో ముందుకు వస్తోంది.

పోస్టర్‌లో ఒక యోధుడు విస్తారమైన ఆకాశ గోళాల ముందు నిలబడి ఉండటం, కథ స్కేల్, విజువల్ గ్రాండ్యూర్, విజన్ చూపిస్తోంది.

బలమైన క్రియేటివ్ విజన్, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ.. అన్నీ కలిసిన ఈ చిత్రం, బిగ్ కాన్వాస్ పై గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది.

SDT19 సినీ ప్రియుల్లో ఆసక్తిని మరింత పెంచుతూ ఒక గ్రాండ్ స్పెక్టకిల్‌గా నిలవనుంది.

నటీనటులు: సాయి దుర్గా తేజ్

దర్శకులు: సుజిత్ & సందీప్
నిర్మాత: సాహు గారపాటి
సమర్పణ: శ్రీమతి అర్చన
బ్యానర్: షైన్ స్క్రీన్స్
పీఆర్వో: వంశీ శేఖర్

- Advertisement -
RELATED ARTICLES

Latest News