Tuesday, March 24, 2026
HomeజాతీయంSupreme Court | మతం మారితే ఎస్సీ హక్కులు కోల్పోతారు

Supreme Court | మతం మారితే ఎస్సీ హక్కులు కోల్పోతారు

  • హిందువుల,సిక్కు, బౌద్ద మతస్థులకే కుల హక్కులు
  • క్రిష్టియన్ మతం స్వీకరిస్తే ఎస్సీ,ఎస్టీ హక్కులు ఉండవు
  • ఎపి హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం కోర్టు

మతమార్పిడికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మతం మారిన ఎస్సీలకు ఆ హోదా ఉండదని స్పష్టం చేసింది. క్రిష్టియన్‌లోకి మారిన వారికి ఎస్సీ కింద లభించే వెసలుబాటు ఉందడని తేల్చింది. మతం మారితన తరవాత అట్రాసిటీ చట్టం కింద కేసులపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరని స్పష్టం చేసింది. హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే ఆ హక్కులు పొందుతారని పేర్కొంది.

ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టి.. మంగళవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో పాస్టర్ చింతాడ ఆనంద్ ఎటువంటి అనుమతులు లేకుండా చర్చి నిర్వహించడంపై అక్కల రామిరెడ్డితో పాటు స్థానికులు అభ్యంతరం తెలిపారు. వారిపై అట్రాసిటీ నిరోధక చట్టం కింద ఆనంద్ కేసు పెట్టారు. ఆ కేసును కొట్టివేయాలంటూ రామిరెడ్డి, స్థానికులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

చింతాడ ఆనంద్ పాస్టర్‌గా పనిచేస్తుండటంతో క్రైస్తవుడవుతారని.. రాజ్యాంగం ప్రకారం షెడ్యూలు కులాలకు సంబంధం ఉండదని రామిరెడ్డి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. పుట్టుకతో హిందువు అయినా.. క్రైస్తవం స్వీకరించడంతో ఆనంద్ షెడ్యూల్ కులానికి చెందరని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అట్రాసిటీ చట్టంలోని సెక్షన్లు ఆయనకు వర్తించవని, ఫిర్యాదు చట్ట వ్యతిరేకమని.. తమపై పెట్టిన కేసుకు విచారణార్హత లేదని వాదించారు. రామిరెడ్డి తరఫు న్యాయవాదుల వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.

క్రైస్తవ మతంలో కులవ్యవస్థ లేదని పేర్కొంది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారికే ఎస్సీ హక్కులు పొందే అర్హత ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ అంజరియా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించింది.

హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లోని వారు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలా కాకుండా మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని తేల్చి చెప్పింది. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్‌గా పని చేస్తున్న వ్యక్తి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని స్పష్టం చేసింది. పాస్టర్ ఆనంద్ దశాబ్దానికి పైగా క్రైస్తవంలో ఉన్నారని.. తిరిగి మారలేదని నిరూపణ అయిందని ధర్మాసనం పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News