Wednesday, March 4, 2026
Homeఖమ్మంSandra | సింగరేణిలో కాంగ్రెస్ అవినీతి, అక్రమాలు

Sandra | సింగరేణిలో కాంగ్రెస్ అవినీతి, అక్రమాలు

సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపణలు

సింగరేణి(Singareni) సంస్థలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) చేస్తున్న అవినీతి, అక్రమాలు(Corruption and Irregularities) బయటపడతాయనే భయంతోనే ఆ పార్టీ నేతలు నోటికొచ్చింది మాట్లాడుతున్నారని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే(Sattupalli Former Mla) సండ్ర వెంకటవీరయ్య(Sandra Venkataveeraiah) విమర్శించారు. మీరు అధికారంలోకి వచ్చాక కమిషన్లు తీసుకోవడం తప్ప చేసిన అభివృద్ధి ఏంటని నిలదీశారు. ఎమ్మెల్యేగా తాను 15 ఏళ్లు ఏం చేశానో ప్రజలకు తెలుసని, ఎమ్మెల్యే కాకుండా షాడో ఎమ్మెల్యేగా ఉంటూ ఈ రెండేళ్లలో మీరు చేసిన అవినీతి కూడా ప్రజలకు తెలుసని ఆరోపించారు.

- Advertisement -

సండ్ర ఇంకా ఏమన్నారంటే..

  • కిష్టారాన్ని దత్తత తీసుకుంటామని చెప్పి ఆ మాటను సింగరేణి విస్మరించింది.
  • ఇప్పటికైనా ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలి. ప్రజల ఇబ్బందులను త్వరతగితిన పరిష్కరించాలి.
  • సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్లను పునరుద్ధరించాలి.
  • ప్రజల పక్షాన నిలబడటానికి నేనెప్పుడూ సిద్ధమే.
  • సింగరేణిలో కాంగ్రెస్ అవినీతి, అక్రమాలు బయటపడతాయనే భయంతోనే ఆ పార్టీ నేతలు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు.
  • గుమ్మడికాయ దొంగలు ఎవరంటే ‘మేం కాదు’ అంటూ భుజాలు తడుముకున్నట్లు ఉంది మీ పరిస్థితి
  • కిష్టారం గ్రామ ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి అధికారులను తీసుకొచ్చి తూతూ మంత్రం చేసింది మీరు కాదా
  • ఎన్టీఆర్ కాలనీ, వెంగళరావు నగర్ కాలనీ, రేజర్ల గ్రామాల్లో సింగరేణి బాధితులకు మీరు చేసిందేంటి?
  • మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్లు తీసుకోవడం తప్పితే మీరు చేసిన అభివృద్ధి ఏంటి?
  • ఎమ్మెల్యేగా నేను 15 సంవత్సరాలు నేనే చేశానో ప్రజలకు తెలుసు.
  • ఎమ్మెల్యే కాకుండా షాడో ఎమ్మెల్యేగా ఉంటూ ఈ రెండేళ్లలో మీరు చేసిన అవినీతి కూడా ప్రజలకు తెలుసు.
- Advertisement -
RELATED ARTICLES

Latest News