Friday, February 13, 2026
Homeసాహిత్యంSatya Sai Baba | సత్యసాయిబాబా జీవితమే సందేశం

Satya Sai Baba | సత్యసాయిబాబా జీవితమే సందేశం

విశ్వమంతటా వ్యాపించిన సత్యసాయిబాబా (Satya Sai Baba) సందేశాలు.. ఆధ్యాత్మికపరమైన అద్భుతాంశాలు. మానవుణ్ని అహంకారం, అజ్ఞానం, అంధకారం నుంచి విముక్తి కలిగించే పవిత్రమైన విషయాలు. ప్రతి మనిషి సత్యంగా నడుచుకోవాలి, ధర్మంగా మసలుకోవాలి. ప్రేమ(Love)తో అందరినీ పలకరించాలి. శాంతంగా (Peaceful) ఉండటానికి ప్రయత్నించాలి. స్వార్థం(Selfishnesత)తో కాకుండా నిస్వార్థంతో ఉండాలి. సేవా (Service) భావం కలిగి ఉండాలి.

మనసులో చెడ్డ భావాలు ఉంటే చెడే (Bad) జరుగుతుంది. మనం చేసే మంచి పనుల వల్ల మనకు తెలియకుండానే కార్యసిద్ది లభిస్తుంది. మానవుడు ప్రేమ, దయ, సత్యం, ధర్మం, శాంతి, సుగుణం కలిగి ఉండాలి. కష్టం వస్తే కుంగిపోరాదు. సుఖం లభిస్తే పొంగిపోరాదు. నిరాడంబరంగా జీవించాలి. అహం (Ego) విడనాడి నీదీ నాదీ అనే స్వార్థం మానుకోవాలి. మూగ జీవాలకు ప్రేమ పంచాలి. గోమాతను పవిత్రంగా పూజించాలి. పవిత్ర భారతీయ సంస్కృతి(Indian culture)ని మరువరాదు.

- Advertisement -

ఇతరులను ప్రేమగా చూడాలి. వినాశకాలే విపరీత బుద్దులు. మంచి బాటలో నడుచుకోవాలి. శ్రీసత్యనారాయణస్వామి వ్రతం (Sri Satyanarayana Swamy Vratham) చేసిన సమయంలోనే సత్యసాయి జన్మించారు. సత్యమే పలికిన బాలుడికి సత్యసాయిబాబా అని నామకరణం చేశారు. చిన్ననాట ఒక సర్పం బాలుడి తలపై పడగ విప్పి ఉండటం తల్లిదండ్రులు గమనించారు. అప్పుడే సత్యసాయి గొప్పవాడవుతాడని గ్రహించారు.

సత్యసాయిబాబా విద్య, వైద్య రంగాల్లో అందరికీ ఉచిత సేవలు అందించి ఆదర్శంగా నిలిచారు. తాగు నీరు లేని గ్రామాల సమస్యను పరిష్కరించి అపర భగీరథుడిగా నిలిచారు. సకల మానవాళికి విలువైన సందేశాలు వినిపించారు. ప్రపంచ దేశాల్లో నేటికీ సత్యసాయి సేవా సంస్థలు.. శ్రీసత్యసాయి సేవాదళ్‌గా మారి వివిధ సేవలు అందిస్తున్నాయి.

(23-11-2025న శ్రీసత్యసాయిబాబా 100వ జయంతి వేడుకల సందర్భంగా)

  • ఎల్.ప్రఫుల్ల చంద్ర

- Advertisement -
RELATED ARTICLES

Latest News