Tuesday, February 24, 2026
HomeజాతీయంTamil Nadu | శశికళ కొత్త పార్టీ.. !

Tamil Nadu | శశికళ కొత్త పార్టీ.. !

  • జయలలిత పుట్టినరోజున నివాళులు అర్పించిన నేత..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ త్వరలో కొత్తపార్టీ పెట్టనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. జయలలిత జయంతిని పురస్కరించుకుని ఆమె స్మారకం దగ్గర శశికళ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె.. ‘తమిళ ప్రజలకు త్వరలో శుభవార్త చెప్పబోతున్నా’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

అమ్మ జయంతి సందర్భంగా ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శశికళ అన్నారు. అందులో శుభవార్త చెప్పబోతున్నానని తెలిపారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ.. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో శశికళ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News