- నూతన పాలకవర్గాన్ని అభినందించిన గ్రామస్తులు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గత మూడు రోజుల నుండి స్థానిక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. వాటిలో ప్రధానంగా వాలీబాల్, షటీల్, జూనియర్ కబడ్డీ, జూనియర్ షటిల్ క్రీడలను స్థానిక ప్రైవేట్ పాఠశాల ఆవరణలో వైభవంగా నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి నగదు బహుమతిగా అందించారు.

వాలీబాల్ క్రీడలో గొడుగు రమేష్ టీం మొదటి బహుమతిగా రూ 3016/, రెండో బహుమతిగా బుర్ర యాకయ్య టీం, రూ 2016/, షెటిల్ మొదటి బహుమతి రూ 2016/దురిశెట్టి శివ టీం, రెండో బహుమతి రూ 1016/ మోటపోతుల సాయిరాం టీం, జూనియర్ కబడ్డీ మొదటి బహుమతి రూ 1016/ భాష బోయిన సాయి గణేష్ టీం, రెండవ బహుమతి రూ 516/ ఎస్.కె సమీర్ టీం, షటిల్ జూనియర్ టీం మొదటి బహుమతి రూ 516/ వల్లాల అజయ్ టీం, రెండో బహుమతి రూ 216/ కనుకుట్ల అభిరామ్ టీం లకు ఆదివారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నగదు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని స్థానికులు అభినందించారు.

ఈ నగదు బహుమతులను స్థానిక సర్పంచ్ గాడిపెళ్లి మహేందర్, ఉప సర్పంచ్ గొడుగు యాకాంత, వార్డు సభ్యులు గాడిపెళ్లి రాజబాబు, బత్తిని జలంధర్, దొంతమాల పవన్ కళ్యాణ్, సూర మంగమ్మ, ముంజంపల్లి నాగరాజు, రాపోలు అనిత, కొండేటి కొమురమ్మ, పస్తం రాధిక, భాషబోయిన రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి మోహినోద్దీన్ ఆధ్వర్యంలో అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ నాయకులు, యువజన సంఘాలు, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

