Tuesday, March 24, 2026
Homeమెదక్‌MPDO | పారిశుద్ధ్యం పచ్చదనం పరిశుభ్రతపై దృష్టి సారించాలి

MPDO | పారిశుద్ధ్యం పచ్చదనం పరిశుభ్రతపై దృష్టి సారించాలి

  • పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీఓ ప్రశాంత్ సూచన

ప్రతి పల్లె గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్యం,పచ్చదనం,పరిశుభ్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీఓ ప్రశాంత్ సూచించారు.సోమవారం చిలిపిచేడ్ మండలం ఎంపిడిఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

పంచాయతీల పరిధిలో శానిటేషన్,ఇందిరమ్మ ఇండ్ల పురోగతి,గ్రామాలలో నర్సరీల పర్యవేక్షణ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంచాయతీలలో ప్రత్యేకంగా పారిశుద్ధ్యం పనులపై దృష్టి సారించాలని,దోమల నివారణ చర్యలు తీసుకోవాలని వారికి సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రశాంత్,ఎంపీఓ తిరుపతి,ఆయా గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News