Tuesday, October 28, 2025
ePaper
Homeతెలంగాణసరూర్‌నగర్ సరస్సులో పారిశుద్ధ్యం, నీటి నాణ్యతను మెరుగుపరచాలి

సరూర్‌నగర్ సరస్సులో పారిశుద్ధ్యం, నీటి నాణ్యతను మెరుగుపరచాలి

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్

సరూర్‌నగర్ సరస్సులో పారిశుద్ధ్యం, నీటి నాణ్యతను మెరుగుపరచాలనీ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం సరూర్‌నగర్ సరస్సును కమిషనర్, ఎల్ బి నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ మరియు AC (శానిటేషన్) రఘు ప్రసాద్‌లతో కలిసి సందర్శించారు. సరస్సులో గణేష్ విగ్రహల నిమజ్జనం తర్వాత జరుగుతున్న పనులను జిహెచ్ఎంసి ఆర్ వి కర్ణన్ పరిశీలించారు. సంబంధిత విభాగాల అధికారులతో కలిసి, కమిషనర్ సరస్సు, దాని పరిసరాల ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, నీటి నాణ్యతను పెంచడం, సరస్సు పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టాలని కమిషనర్ కర్ణన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News