చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో ఈసారి మేడారంలో సమ్మక్క–సారలమ్మ(Sammakka–Saralamma) మహా జాతర(Maha Jatara)ను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 200 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా నిలిచేలా గద్దెల శాశ్వత పునర్నిర్మాణం చేపట్టింది. మేడారం అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేక దృష్టి పెట్టారు. మొత్తం రూ.251 కోట్లతో మేడారం సమగ్రాభివృద్ధికి శ్రీకారం చుట్టారు. గద్దెల విస్తరణకే రూ.101 కోట్లు కేటాయించారు. 4 వేల టన్నుల గ్రానైట్‌తో గద్దెల ప్రాంగణ నిర్మాణం చేస్తున్నారు. 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించిన 7 వేలకి పైగా శిల్పాలు చెక్కుతున్నారు. 930 ఏళ్ల కోయల తాళపత్ర గ్రంథాల ఆధారంగా శిల్ప రూపకల్పన చేశారు. 46 స్తంభాలతో 271 చ.మీ విస్తీర్ణంలో ప్రాకారం నిర్మిస్తున్నారు.
8 స్తంభాలతో వృత్తాకార గద్దె నిర్మాణం జరుగుతోంది. 40 అడుగుల వెడల్పుతో 3 స్వాగత తోరణాలు ఏర్పాటుచేస్తున్నారు. 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలను తీర్చిదిద్దుతున్నారు. 50 అడుగుల వెడల్పుతో ప్రధాన స్వాగత తోరణం వెలుస్తోంది. ఉన్న చెట్లను తొలగించకుండా అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నారు. బండారి, మర్రి, వెదురు, వేప, ఇప్ప తదితర 12 రకాల పవిత్ర వృక్షాలు,140 రకాల ఆయుర్వేద మొక్కల నాటనున్నారు. పూజారుల సంఘం ఆమోదంతోనే అన్ని పనులు చేస్తున్నారు. నాణ్యతలో ఎక్కడా రాజీ లేదని తేల్చిచెప్పారు. రోజువారీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. జనవరి 28 నుంచి 31 వరకు మహా జాతర జరగనుంది. కోటి మంది(One Crore)కి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
