Thursday, March 26, 2026
Homeఆంధ్రప్రదేశ్Sajjala | అమరావతికి జగన్ వ్యతిరేకం కాదు

Sajjala | అమరావతికి జగన్ వ్యతిరేకం కాదు

ఏపీ రాజధాని(AP Capital) అమరావతి(Amaravati)కి మాజీ సీఎం జగన్(Former CM Jagan) ఎప్పుడూ వ్యతిరేకం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(Ysrcp) రాష్ట్ర సమన్వయకర్త(State Coordinator) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతిలో నిర్మాణాల పేరుతో దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన శనివారం తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. అమరావతి విషయంలో జగన్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరారు. రాయలసీమ లిఫ్ట్‌(Rayalaseema Lift)పై ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. ‘జగన్ అమరావతిలోనే ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. చంద్రబాబు(Chandrababu) ప్రతి వారం హైదరాబాద్ ఎందుకు వెళుతున్నారు? జగన్ ప్రతి వారం అమరావతిలో ఎన్ని రోజులు ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. వ్యక్తిగత పనుల కోసమే బెంగళూరు వెళతారు’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News