- చదువు సాగక విద్యార్థుల మనోవేదన…
- కెమిస్ట్రీ టీచర్ లేక ఆగిపోయిన సబ్జెక్ట్…
- సైనిక స్కూల్లో పదిమంది ఉండాల్సిన రిటైర్డ్ ఆర్మీ అధికారులు జీతాలు రాక పరార్..
- 600 మంది విద్యార్థుల మనోవేదన
నర్సంపేట: అసలే సైనిక స్కూల్ ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండియర్ వరకు 600 మంది విద్యార్థులు ఆర్మీ డ్రస్సులు వేసుకొని విద్యను అభ్యసించే అత్యంత ప్రాముఖ్యమైన పాఠశాల. క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచే పాఠశాలలో విద్యా సంవత్సరం స్టార్ట్ అయి ఆరు నెలలు గడిచినప్పటికీ ఇప్పటివరకు కెమిస్ట్రీ టీచర్ లేక 600 మంది విద్యార్థులు చదువు సాగేదెట్ల అని మనోవేదనకు గురవుతున్నారు. అంతేకాకుండా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు పదిమంది ఉండి విద్యార్థులకు సైనికుల నియమాలు, క్రమశిక్షణ, పోరాటపటిమ, పట్టుదల తదితర విషయాలను క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు నేర్పిస్తూ సైనిక శిక్షణలో తర్ఫీదు ఇస్తూ విద్యార్థుల ను మానసికంగా ఒక బార్డర్ సైనికులు వలే తయారు చేయాలి.

ఇందుకుగాను వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్ నగర్ పాఠశాలలో పది మంది రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు అవసరం అవుతున్నది. గత కొన్ని నెలల నుండి ప్రభుత్వం నుండి వారికి జీతభత్యాలు సరియైన సమయంలో రాకపోవడంతో చేసేదేమీ లేక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు 9 మంది వెళ్లిపోయినట్లు శనివారం జరిగిన పేరెంట్స్ కమిటీ మీటింగ్ లో బహిర్గతమైంది. అదేవిధంగా 40 మంది ఉపాధ్యాయులు అవసరం ఉన్న ఈ పాఠశాలకు 25 మంది మాత్రమే రెగ్యులర్ ఉపాధ్యాయులు ఉండగా మరో 15 మందిని కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా తీసుకోవడం ఈ పాఠశాలలో నడుస్తున్న తతంగం.
సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి:: చాంద్ పాషా పేరెంట్స్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ దేశానికే తలమానికంగా ఉన్న ఈ సైనిక పాఠశాలలో సమస్యలు అధికంగా ఉన్నాయని క్రమశిక్షణ నేర్పాల్సిన ఆర్మీ ఆఫీసర్ లేకపోవడం ఇప్పటివరకు కెమిస్ట్రీ ఉపాధ్యాయుడు లేకపోవడం, పాఠశాలకు 40 మంది ఉపాధ్యాయులు అవసరం ఉండగా 25 మంది రెగ్యులర్ ఉపాధ్యాయులతో నడిపిస్తూ మరో 15 మందిని కాంటాక్ట్ కింద తీసుకోవడం పాఠశాల ప్రతిష్ట దిగజారిపోతుందని వెంటనే సమస్యలు పరిష్కరించేల ప్రభుత్వాధికారులు కృషి చేయాలని శనివారం జరిగిన పేరెంట్స్ కమిటీ మీటింగ్లో పేరెంట్స్ కమిటీ ఉపాధ్యక్షులు చాంద్ పాషా డిమాండ్ చేశారు.
