Sunday, April 12, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంAadab Hyderabad Effect | ‘సాయి క్లినిక్‌’ సీజ్‌

Aadab Hyderabad Effect | ‘సాయి క్లినిక్‌’ సీజ్‌

ప్రజారోగ్య పరిరక్షణలో ఉమా గౌరీ తక్షణ, నిర్ణయాత్మక చర్య!

  • ప్రజారోగ్య పరిరక్షణలో తక్షణ స్పందన!
  • అక్రమ క్లినిక్‌ పై జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిని ఉమా గౌరీ ఉక్కుపాదం.
  • జిల్లా వైద్యాధికారిణిపై కూకట్‌పల్లి ప్రజల ప్రశంసల జల్లు

కూకట్‌పల్లి, ఆల్విన్‌ కాలనీలో ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తూ అక్రమంగా నడుస్తున్న ‘సాయి క్లినిక్‌’ మరియు ‘శ్రీ లక్ష్మీ మెడికల్స్‌’ పై వచ్చిన సంచలన ఆరోపణల విషయంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారిణి డా. ఉమా గౌరీ యొక్క తక్షణ, నిర్ణయాత్మక చర్యను ప్రజలు మరియు స్థానిక వర్గాలు విశేషంగా ప్రశంసిస్తున్నాయి. పత్రికా కథనం ద్వారా సమాచారం అందిన వెంటనే, ప్రజారోగ్యం పట్ల తన నిబద్ధతను చాటుతూ, డా. ఉమా గౌరీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించారు. అక్రమంగా కొనసాగిస్తున్న ఈ క్లినిక్‌ మరియు మెడికల్‌ షాప్‌పై తక్షణమే విచారణకు ఆదేశించి, నిబంధనల ఉల్లంఘన స్పష్టమైనందున ఆ క్లినిక్‌ను సీజ్‌ చేయడం జరిగింది.

- Advertisement -

ప్రశంసనీయమైన వేగం మరియు నిబద్ధత..

ఈ వ్యవహారంలో డా. ఉమా గౌరీ చూపిన వేగం, పారదర్శకత, మరియు ప్రజల ఆరోగ్యం పట్ల ఆమెకున్న అపారమైన బాధ్యత అభినందనీయం. సాధారణంగా ప్రభుత్వ విభాగాల నుండి ఇలాంటి తక్షణ స్పందన అరుదుగా కనిపిస్తుంది. వార్తా కథనం తీవ్రతను గుర్తించి, జిల్లా వైద్యాధికారిణిగా డా. ఉమా గౌరీ తీసుకున్న ఈ చర్య, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఆమె ఇస్తున్న అత్యంత ప్రాధాన్యతను నిరూపిస్తుంది. హోమియోపతి వైద్యుడు అల్లోపతి ప్రాక్టీస్‌ చేయడం, గడువు ముగిసిన మందులను విక్రయించడం వంటి తీవ్రమైన ఆరోపణలను ఆమె తేలికగా తీసుకోకుండా, అక్రమ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయడానికి క్లినిక్‌ను సీజ్‌ చేయించారు. ఈ చర్య కూకట్‌పల్లి ప్రజలకు ఒక గొప్ప భరోసానిచ్చింది. ప్రజల ఆరోగ్యంపై చెలగాటం ఆడేవారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందనే సందేశాన్ని స్పష్టం చేసింది.

ప్రజారోగ్యం అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం. జిల్లా వైద్యాధికారిణి డా. ఉమా గౌరీ వెంటనే స్పందించి, అక్రమ క్లినిక్‌ను సీజ్‌ చేయడం ఒక గొప్ప ముందడుగు. ఇలాంటి అధికారిణి మాకు ఉండటం అదృష్టంగా భావిస్తున్నాం.’’ అని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్లినిక్‌ సీజ్‌ అయినందున, దీనిపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగించి, డాక్టర్‌ ఎం.ఎస్‌. రెడ్డిపై మరియు శ్రీ లక్ష్మీ మెడికల్స్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా వైద్యాధికారిణి ఉమా గౌరీ తీసుకున్న ఈ చర్య, రాష్ట్రంలోని ఇతర జిల్లా వైద్య అధికారులకు ఆదర్శప్రాయమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News