Tuesday, October 28, 2025
ePaper
Homeతెలంగాణనిండుకుండలా సాగర్‌ జలాశయం

నిండుకుండలా సాగర్‌ జలాశయం

ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో సోమవారం నాగార్జున సాగర్‌ డ్యాం నిండుకుండను తలపిస్తుంది. శ్రీశైల ప్రాజెక్టు నుంచి 93,127 క్యూసెక్కుల వరద సాగర్‌కు వచ్చి చేరుతున్నది. ఇప్పటికే పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతోపాటు ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో క్రస్టు గేట్లను ఎత్తడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. మంగళవారం ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 583.8 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులో గరిష్ఠంగా 312.05 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ఇప్పుడు 293.97 టీఎంసీల నీరు ఉన్నది. మరో 18 టీఎంసీల నీరు వస్తే నాగార్జున సాగర్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుతుంది. ఇక శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతున్నది. ప్రస్తుతం రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News