Thursday, February 19, 2026
Homeవరంగల్‌Mulugu | "సాదా బైనమా" భూముల సాగుదారు రైతులకు మోక్షం లభించేనా..?

Mulugu | “సాదా బైనమా” భూముల సాగుదారు రైతులకు మోక్షం లభించేనా..?

  • ములుగుజిల్లా లో మూలుగుతున్న ముప్పై వేల సాధాబైనామ దరఖాస్తులు
  • గత 12 సంవత్సరాల నుంచి ఏజన్సీ రైతుల నిరీక్షణ!
  • తెల్ల కాగితాల మీద ప్రయావిక్రయలు జరుపుకున్న రైతుల కష్టాలు తీరేనా..?

ములుగు జిల్లా ఏజన్సీ రైతులు గత కొన్నేళ్ల కిందట తెల్ల కాగితాల మీద క్రయవిక్రయాలు జరుపుకున్న సాగుదారులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనైనా సాదా బైనామా భూములకు మోక్షం లభిస్తుందా..లేదా బారసా ప్రభుత్వం మాదిరిగానే కాలయాపన తప్పదా అని పట్టాల కోసం సుదీర్ఘంగా ఎదురుచూస్తున్న రైతులు నిరీక్షణ తో ఆశాలపల్లకీలో ఉన్నారు.కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి కి వచ్చి కూడా రెండున్నర ఏళ్ళు గడుస్తున్నా ఇంకా వాటికి మోక్షం లేనట్లే నా…

అన్నదాతలకు ఇచ్చిన హామీలు, విశ్వసనీయత తప్పుతుందా అని చర్చ మొదలైంది. అయితే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి ద్వారా సాదా బైనామాలకు భూ సమస్యల పరిష్కారం చేస్తామని ప్రభుత్వం ఆర్ ఓ ఆర్ చట్టాన్ని తీసుకురావడంతో దరఖాస్తు లు కూడా గ్రామసభల ద్వారా తీసుకోడంతో ఈ ప్రాంత రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.గత 10 సంవత్సరంలో రెండుసార్లు సాదాబైనామాల కోసం సుమారు రాష్ట్రం వ్యాప్తంగా తొమ్మిది లక్షల పైననే మీసేవ ద్వారా ఆన్లైన్ చేయించుకొని రాష్ట్ర అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

సాదాబైనామా బుక్కుల కోసం సాగుదారుడు నిరీక్షణతో ఎదురుచూస్తుండగా ప్రభుత్వం తీపి కబురు వెల్లడించడంతో తిరిగి రైతుల్లో ఆశలు చిగురించి ఈసారైనా తెల్ల కాగితాల మీద భూముల క్రయవిక్రయాలు జరుపుకున్న వారి కుటుంబాల్లో ఆనందం వ్యక్తం అవుతున్నాయి. గత బి ఆర్ ఎస్ పాలనలోనే 2014 ముందు తెల్ల కాగితాల మీద క్రయవిక్రయాలు జరుపుకున్న వారికి పట్టా పాస్ బుక్కు అందజేస్తామనడంతో గ్రామాలలో పట్టణాలలో సందడి వాతావరణం కనిపించింది.తెల్ల కాగితాల మీద కొనుగోలు చేసిన రైతులు అమ్మిన రైతు వద్ద ప్రాధేయ పడుతూ కాగితాలను అన్ని తయారు చేసుకుని మీ సేవ కేంద్రాలలో రెండుసార్లు వేలాదిగా ఫీజులను కట్టి మరీ ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నారు.

సాదా బైనామ బుక్కులకు తెల్ల కాగితాల మీద కొనుగోలు చేసుకున్న కూలీలు రైతులు మహిళలు తదితరులు క్యూ లైన్లు కట్టి ఆన్లైన్ చేసుకున్నారు. రెండుసార్లు ప్రభుత్వం ఆశ చూపినట్లు చూపి సాదా బైనామ విషయాన్ని మరిచిపోవడంతో రైతులు రైతు కుటుంబాలు కన్నీటి పర్యంతం చెందారు. తమ భూములకు పట్టా పాస్ బుక్కులు వస్తాయా .. రావా అని భూములను సాగు చేసుకుంటూ ప్రభుత్వ రుణ సహాయానికి నోచుకోక ఆయా ఉమ్మడి కుటుంబంలో పలు ఘర్షణలకు కూడా జరిగిన సంఘటనలు కనిపించాయి.

తీరా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పేరట కొత్తగా భూభారతి, ఆర్ ఓ ఆర్ ద్వారా సాదా బైనామాల భూములకు పాత రెవిన్యూ చట్టాన్ని అమలుపరిచి గ్రామానికి విఆర్ఓ ల వ్యవస్థను తీసుకువచ్చి రైతులకు లాభం చేకూర్చాలని సంకల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు అభినందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెవెన్యూ విధానాన్ని తీసుకురావడంతో సహా పేపర్లపై భూముల క్రయ విక్రయాలు జరిపిస్తున్న వారి కుటుంబాలలో ఆశలు చిగురించాయి.

ధరణి వలన గ్రామీణ ప్రాంత రైతులతో పాటు క్రయవిక్రయాలు మీద జరుపుకున్న వారికి తలనొప్పిగా మారిందనే నేపథ్యంలో విఆర్ఓల వ్యవస్థ ద్వారా సాదాబైనామాలకు మోక్షం లభిస్తుందని ఆశల్లో ఎదురుచూస్తున్నారు. వీఆర్వో వ్యవస్థ రావడంతో సాగుదారుల రైతులను గుర్తించి నాలుగు వైపులా ఉన్న రైతులను వాంగ్మూలం ద్వారా సాదా బైనామాలకు పాస్ బుక్కులు అందించ వచ్చానే ఉద్దేశంతోనే కొత్తచట్టాన్ని తీసుకురావడం పట్ల రైతులు సంబరాలను జరుపుకుంటున్నారు.

ములుగుజిల్లా ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి,వెంకటాపురం, వాజేడు,కన్నాయిగూడెం,మల్లపల్లి తదితర మండలంలోని సాదా బైనమా ద్వారా వేలాదిమంది ఆన్లైన్ చేసుకొని నిరీక్షిస్తున్నారు.ఈసారైనా రాష్ట్ర ప్రభుత్వం సాదా బైనామా పేరట కొనుగోలు చేసిన వారి కుటుంబాలలో పాసుబుక్కుల అందించి వెలుగులు నింపేలా చేస్తారా అని వేలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ సాదా బైనామా ద్వారా రైతుల కష్టాలు కూడా తీరుతాయని, ఇది పేదల ప్రజా పాలన అని, జిల్లా కాంగ్రెస్ పార్టీ ,మండలం నాయకులు తదితరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News