Saturday, October 4, 2025
ePaper
Homeబిజినెస్రెడిట్ బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్

రెడిట్ బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్

సామాజిక మాధ్యమం రెడిట్ బ్రాండ్ అంబాసిడర్‌గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ వ్యవహరించనున్నారు. ఇకపై తన అభిప్రాయాలను, మ్యాచ్‌ల విశ్లేషణలను, తనకే సొంతమైన కంటెంట్‌ను ఈ వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఇండియాతోపాటు ఇతరత్రా మార్కెట్ల కోసం క్రియేట్ చేసే కొత్త మార్కెటింగ్ ప్రచార ప్రకటనల్లో సచిన్ టెండుల్కర్ కనిపిస్తారు.

రెడిట్‌తో జట్టు కట్టడపై సచిన్ సంతోషం వ్యక్తం చేశారు. సచిన్‌తో కలిసి పనిచేయనుండటంపై రెడిట్ కూడా హర్షం వ్యక్తం చేసింది. క్వాలిటీ క్రికెట్‌కి మరో పేరు సచిన్ అని ప్రశంసించింది. రెడిట్ ప్లాట్‌ఫామ్‌పై క్రీడల కంటెంట్ పట్ల ప్రేక్షకులు వార్షికంగా 30 శాతం అదనంగా ఆసక్తి ప్రదర్శిస్తున్నారని సంస్థ వైస్ ప్రెసిడెంట్ దుర్గశ్ కౌషిక్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News