- ఫారెక్స్ రిజర్వులు భారీగా పతనం..
- యుద్ధ పరిస్థితులే కారణం..
విదేశీ మారకం నిల్వలు కరిగిపోతున్నాయి. రూపాయి విలువ పాతాళానికి పడిపోవడంతోపాటు విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ అంతకంతకు పడిపోవడంతో ఫారెక్స్ రిజర్వుల భారీగా పడిపోతున్నాయి. మార్చి నెల చివరివారంలో ఫార్సె రిజర్వులు 10.288 బిలియన్ డాలర్లు తరిగిపోయి 688.058 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ రిజర్వులు 11.414 బిలియన్ డాలర్లు పడిపోయిన విషయం తెలిసిందే.
మొత్తంగా వరుసగా రెండు వారాల్లో రిజర్వులు 22 బిలియన్ డాలర్లు పడిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో రికార్డు స్థాయి 728.494 బిలియన్ డాలర్లకు చేరుకున్న ఫారెక్స్ రిజర్వులు గడిచిన నెల రోజుల్లోనే 30 బిలియన్ డాలర్ల స్థాయిలో పతనం చెందాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా రూపాయి కరెన్సీ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నది.
