Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeఅంతర్జాతీయంఒక్క ‘సారీ’తో రూ.1600 కోట్లు

ఒక్క ‘సారీ’తో రూ.1600 కోట్లు

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి సారీ చెప్పటంతో ఆయన సంపాదన ఏకంగా రూ.1600 కోట్లు పెరిగింది. ఆయన సంస్థ టెస్లా షేర్ల విలువ 0.10 శాతం పెరిగి 326.43 డాలర్లకు చేరింది. వీళ్లిద్దరి మధ్య ఇటీవల విభేదాల నేపథ్యంలో టెస్లా షేర్లు ఒక్క రోజే 14 శాతం పతనమయ్యాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ సుమారు 152 బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి.

అయితే.. ఎలాన్ మస్క్ అనూహ్యంగా మెట్టు దిగారు. ట్రంప్‌పై చేసిన దూకుడు వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం (జూన్ 11న) ఉదయం ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. మస్క్ క్షమాపణలను ట్రంప్ సైతం అంగీకరించినట్లు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌజ్ ప్రకటించింది. దీంతో మస్క్ సంస్థల షేర్లు ఇప్పుడు కాస్త పుంజుకున్నాయి. యూఎస్ గవర్నమెంట్ రూపొందించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును టెస్లా అధిపతి వ్యతిరేకించటంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News