పెద్దపల్లి జిల్లాలోని మహిళల స్వయం సహాయక సంఘాలకు(women’s self help groups) ప్రభుత్వం 10 కోట్ల 32 లక్షల 62 వేల రూపాయల వడ్డీ రాయితీ(VLR)ని విడుదల చేసింది. సంబంధిత చెక్‌ను ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) ఈరోజు పెద్దపల్లిలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ మేరకు ‘ఆడబిడ్డలకు పుట్టింటి కానుక’(Aadabiddalaku Puttinti Kanuka) పేరుతో కార్యక్రమం నిర్వహించారు. చైతన్య జ్యోతి జిల్లా మహిళా సమాఖ్యలో పెద్దపల్లి జిల్లాలోని 13 మండలాలకు చెందిన 9196 స్వశక్తి సంఘాలు ఉన్నాయి. వాటికి సంబంధించి 2024 అక్టోబర్ నుంచి 2025 మార్చి వరకు చెల్లించాల్సిన వీఎల్ఆర్‌ను విడుదల చేశారు.
- Advertisement -
