Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డిKuntloor | నిరుపేదల కోసం రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సేవలు

Kuntloor | నిరుపేదల కోసం రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సేవలు

రోటరీ క్లబ్ అఫ్ హైదరాబాద్ వారి సహకారంతో అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని కుంట్లూరు రావి నారాయణ రెడ్డి ఫెజ్ 3 భూ పోరాట కేంద్రంలో వెలుగులు నిండాయి. హైదరాబాద్ కి కూతవేటు దూరంలో గత నాలుగేళ్లుగా కొన్ని వేల కుటుంబాలు చిమ్మ చీకట్లో జీవనం సాగిస్తున్నారు.అనేక మంది పిల్లలు ఆ చీకట్లోనే తమ చదువులను సైతం కొనసాగిస్తున్నారు. విషయం తెలుసుకొని రోటరీ క్లబ్ అఫ్ హైదరాబాద్ సౌజన్యం వారు దాతల సహకారంతో భూ పోరాట కేంద్రంలో ఏర్పాటు చేయటానికి కొన్ని వందల సోలార్ లైట్లని అందించారు.

భూ పోరాట కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆ లైట్లని రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంస్థ అధ్యక్షులు సురేష్ బాబు, కార్యదర్శి మాధవి, మాజీ అధ్యక్షులు వాణ శ్రీ, మాజీ కార్యదర్శి అజయ్ కుమార్, రవి, రష్మీ, రమ, ప్రసాద్, శ్రీనివాస్ రావు, సుబ్బారావుల బృందం బుధవారం నాడు పరిశీలించారు. కొన్ని వేల మంది నిరుపేద ప్రజలు కనీస సదుపాయాలు లేకుండా ఇన్నేళ్లుగా కారు చీకట్లో జీవనం గడపటం, అనేక మంది పాఠశాల విద్య నుండి మొదలు ఉన్నత స్థాయి విద్యను అభ్యసించే వాళ్ళు ఈ గుడిసెల్లో నివసించటం చూసి ఆశ్చర్యపోయారు.

- Advertisement -

తమ సంస్థ నుండి అందించిన సోలార్ లైట్ల వెలుతురులో స్కూల్ పిల్లలు చదువుకోవటం, ఆడుకోవటం చూసి వాళ్ళు సంతోష పడ్డారు. ఇలాంటి పేద ప్రజల కోసం భవిష్యత్తులో కూడా అనేక సహాయ, సహకారాలు అందించటానికి తాము సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్ర చారీ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి మాట్లాడుతూ మానవతా దృక్పతంతో నీరుపేద ప్రజల పట్ల ప్రేమతో భూ పోరాట కేంద్రం గుడిసెల్లో వెలుగులు నింపిన రోటరీ క్లబ్ అఫ్ హైదరాబాద్ సౌజన్యం వారికి శాలువాలు కప

- Advertisement -
RELATED ARTICLES

Latest News