Saturday, October 4, 2025
ePaper
Homeస్పోర్ట్స్ముంబై జట్టుకు రోహిత్‌, యశస్వి, అయ్యర్‌ దూరం

ముంబై జట్టుకు రోహిత్‌, యశస్వి, అయ్యర్‌ దూరం

ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్‌ టోర్నీ రంజీ ట్రోఫీ 2024-25లో ముంబై ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ దూరం కానున్నారు. మేఘాలయతో గురువారం నుంచి ముంబై తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు భారత స్టార్‌ ఆటగాళ్లు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శివమ్‌ దూబే.. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ నేపథ్యంలో ముంబై జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. నితీష్‌ కుమార్‌ రెడ్డి పక్కటెముకల గాయంతో సిరీస్‌ మొత్తానికి దూరమవ్వడంతో అతని స్థానంలో శివమ్‌ దూబేకు అవకాశం దక్కింది. ఇప్పటికే దూబే భారత జట్టుతో కలిసాడు. మరోవైపు బీసీసీఐ వార్షిక అవార్డ్‌ల కార్యక్రమం నేపథ్యంలోనే రోహిత్‌, యశస్వి, అయ్యర్‌లు ముంబై ఆఖరి లీగ్‌ రంజీ మ్యాచ్‌కు దూరంగా ఉంటారని తెలుస్తోంది. ఫిబ్రవరి 1న ముంబైలో ఈ కార్యక్రమం జరగనుంది. ఫిబ్రవరి రెండో తేదీనే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ క్యాంప్‌ నాగ్‌పూర్‌ వేదికగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ముంబై ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు స్టార్‌ ఆటగాళ్లంతా దూరంగా ఉంటారని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. ఫిబ్రవరి 6 నుంచి ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News