ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటర్ల (One Day Batters) ర్యాంకుల్లో రోహిత్ శర్మ (Rohit Sharma) నంబర్-1గా నిలిచాడు. రెండో స్థానాన్ని విరాట్ కోహ్లీ (Virat Kohli) సొంతం చేసుకున్నాడు. టాప్-5 మనవాళ్లు ముగ్గురు ఉండటం విశేషం. శుభ్‌మన్‌గిల్ (Shubhman Gill) ఐదో ర్యాంక్ సాధించాడు. కోహ్లీ నాలుగో పొజిషన్ నుంచి రెండో స్థానానికి వచ్చాడు. దక్షిణాఫ్రికా(South Africa)తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతంగా ఆడటంతో ర్యాంక్ మెరుగుపడింది. వరుసగా రెండు మ్యాచ్‌లలో శతకాలు బాదిన సంగతి తెలిసిందే. మూడో వన్డేలో 65 రన్నులతో నాటౌట్‌గా నిలిచాడు. బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ మూడో ప్లేస్‌లో ఉన్నాడు.
- Advertisement -
