Wednesday, February 11, 2026
Homeహైదరాబాద్‌Road Safety Abhiyan | రోడ్ సేఫ్టీ అభియాన్ ప్రారంభం

Road Safety Abhiyan | రోడ్ సేఫ్టీ అభియాన్ ప్రారంభం

చిన్మయ విద్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ
9వ తేదీ వరకు ప్రచార కార్యక్రమం
టీఎస్‌ఎల్‌ఎస్ఏ చైర్మన్ శామ్ కోశి వెల్లడి

తెలంగాణ హైకోర్టు జడ్జి(Telangana High Court Judge), తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(Telangana State Legal Services Authority) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.శామ్ కోశీ.. రోడ్ సేఫ్టీ అభియాన్(Road Safety Abhiyan)-2026 ప్రచారాన్ని సోమవారం ప్రారంభించారు. హైదరాబాద్‌లోని కుందన్‌బాగ్‌లో ఉన్న చిన్మయ విద్యాలయలో సంబంధిత పోస్టర్‌ను ఆవిష్కరించారు(Poster Release). ఈ అవగాహన కార్యక్రమం(Awareness Programme) ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరుగుతుంది. ఇందులో భాగంగా విద్యార్థులకు, యువతకు, ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తారు. మోటర్ వాహనాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రచారంలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలు, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీలు స్కూల్స్, కాలేజీల్లో అవేర్‌నెస్ క్యాంప్‌లను నిర్వహిస్తాయి. మోటర్ వాహనాల చట్టం(Motor Vehicle Act)లోని రోడ్ సేఫ్టీకి సంబంధించిన నియమ, నిబంధనలను వివరిస్తారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఎస్ఆర్ నగర్ ఏసీపీ ఎస్.వి.రాఘవేందర్‌రావు, ప్రిన్స్‌పల్ రామగిరి విద్యాసాగర్, టీఎస్‌ఎల్‌ఎస్ఏ సభ్య కార్యదర్శి సీహెచ్.పంచాక్షరి తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని వివరించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోతే కోర్టులు శిక్షలు విధిస్తాయని హెచ్చరించారు. శామ్ కోశి.. విద్యార్థులతో, కార్యక్రమంలో పాల్గొన్నవారితో రోడ్ భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News