Wednesday, March 4, 2026
Homeఆంధ్రప్రదేశ్RK Roja | బీ ఆర్ నాయుడు రాజీనామా చేయాలి..

RK Roja | బీ ఆర్ నాయుడు రాజీనామా చేయాలి..

  • డిమాండ్ చేసిన ఆర్.కె. రోజా..

ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో టీటీడీ చైర్మన్‌ పదవికి బీఆర్‌ నాయుడువెంటనే రాజీనామా చేయాలని వైసీపీ మాజీ మంత్రి ఆర్‌కె రోజా డిమాండ్‌ చేశారు. నగరిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ టీటీడీ పదవికి నాయుడు అనర్హుడని ఆరోపించారు. ఆయన హయాంలో ఆవుల మరణాలు, తొక్కిసలాట ఘటనలు జరిగాయని అన్నారు.

దేశంలో ఏ ఆలయ చైర్మన్‌కు సంబంధించిన వీడియోలు ఇలా బయపటడిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. బీఆర్‌ నాయుడికి మహిళలంటే గౌరవం లేదని వెల్లడించారు. నిజం ఉంటేనే ఇందు అనే మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు, మంత్రి నారా లోకేష్‌కు లేఖ ఎందుకు రాస్తుందని అన్నారు.

- Advertisement -

టీటీడీ చైర్మన్‌పై వచ్చిన వీడియోలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లడ్డూ వివాదంలో సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగినప్పటికీ మళ్లీ ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటు అనవసరమని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News