- వందల కోట్ల అక్రమ సామ్రాజ్యంలో తెర వెనుక అసలు సూత్రదారి..!
- జూనియర్ అసిస్టెంట్ సునీతా బాయ్ అవినీతి చిట్టా వెలుగు
- అక్రమ భూ కబ్జాల్లో రెవెన్యూ అధికారుల చీకటి ఒప్పందాలు
- సర్వే, సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖలో రంగారెడ్డి భూముల దోపిడీలో కీలక పాత్ర
కేవలం ఒక జూనియర్ అసిస్టెంట్ హోదాలో ఉండి, కోట్లకు పడగలెత్తిందంటే… ఈ జిల్లాలో భూ దోపిడీ ఎంత బరితెగించిందో ఊహించవచ్చు. భూముల రికార్డులను చూసే కీలక బాధ్యతను అడ్డుపెట్టుకుని, ఈమె ఏకంగా వందల కోట్లలో ‘వాటాలు’ పంచుకుందన్న ఆరోపణలు సామాన్య ప్రజలను స్థంభించిపోయేలా చేస్తున్నాయి. ఇంతకుముందు అరెస్టయిన అధికారి కంటే… ఈమె పోషించిన పాత్రే అత్యంత కీలకం!
సాధారణ జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగి… కానీ ఆమె సృష్టించిన అవినీతి సామ్రాజ్యం విలువ వేల కోట్లు! తెలంగాణ చరిత్రలోనే అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తులను మాయం చేసిన అతిపెద్ద భూ బాగోతం ఇది. వందల కోట్ల విలువైన భూములు, చెరువులు, కుంటలు కబ్జా కావడానికి కారణమైన రెవెన్యూ వ్యవస్థలోని మట్టిలోతుకు పాతుకుపోయిన బరితెగించిన అవినీతికి, ఇది అక్షరాలా కళ్లు బైర్లు కమ్మే నిదర్శనం! రంగారెడ్డి జిల్లా భూకుంభకోణంలో ఇప్పటివరకు అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్ పర్వం కేవలం ఒక చిన్న తెర మాత్రమే. ఈ వేల కోట్ల చీకటి సామ్రాజ్యంలో… అన్ని అక్రమ ఒప్పందాలను, ‘వాటాల’ పంపిణీని శాసించిన అసలు ‘వసూళ్ల రాణి’ ఆట ఇప్పుడే మొదలైంది!
కేవలం ఒక జూనియర్ అసిస్టెంట్ హోదాలో ఉండి, కోట్లకు పడగలెత్తిందంటే… ఈ జిల్లాలో భూ దోపిడీ ఎంత బరితెగించిందో ఊహించవచ్చు. భూముల రికార్డులను చూసే కీలక బాధ్యతను అడ్డుపెట్టుకుని, ఈమె ఏకంగా వందల కోట్లలో ‘వాటాలు’ పంచుకుందన్న ఆరోపణలు సామాన్య ప్రజలను స్థంభించి పోయేలా చేస్తున్నాయి. ఇంతకుముందు అరెస్టయిన అధికారి కంటే… ఈమె పోషించిన పాత్రే అత్యంత కీలకం! ఆమె దస్త్రం తెరిస్తే… బద్దలయ్యే చీకటి ఒప్పందాలు! కబ్జాదారులు, రియల్టర్లతో ఈ ‘వసూళ్ల రాణి’ జరిపిన గోప్యమైన లావాదేవీల చిట్టా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కోట్లకు కోట్లు పోగేసిన ఈ జూనియర్ అసిస్టెంట్ అక్రమ ఆస్తుల చిట్టా, ‘వసూళ్ల రాణి’ బాగోతంపై ప్రత్యేక కథనం…
తెలంగాణలోనే అత్యంత విలువైన భూములకు నిలయమైన రంగారెడ్డి జిల్లాలో భూ కబ్జాదారులు, రెవెన్యూ అధికారుల మధ్య నడుస్తున్న చీకటి ఒప్పందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు, చెరు వులు, కుంటల ఆక్రమణలకు సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ కోంతం శ్రీని వాసులు అక్రమ ఆస్తుల కేసులో అరెస్టైన వ్యవ హారం మరువక ముందే, ఈ మొత్తం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన మరో ప్రభుత్వ ఉద్యోగి, జూనియర్ అసిస్టెంట్ సునీతా బాయ్ అవినీతి చిట్టా అక్షరాలా కళ్లు బైర్లు కమ్మేలా చేస్తోంది.

కోట్లలో ‘వాటాలు’
జిల్లాలోని సర్వే, సెటిల్‌మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సునీతా బాయ్… రంగారెడ్డి భూముల దోపిడీలో ఏకంగా ఓ సామ్రాజ్యాన్నే సృష్టించింది. ముఖ్యంగా, భూముల సరిహద్దులు, స్వభావం, డిమార్కేషన్, అలాగే కోట్లాది రూపాయల విలువైన హెచ్‌ఎండీఏ, డీటీసీపీ లేఅవుట్‌లకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన ఏ3 సెక్షన్ నివేదికల బాధ్యతను ఐదేళ్లుగా ఈమె చూస్తోంది. భారీ ఎత్తున ముడుపులు తీసుకొని సర్వే చేసిన డీటీసీపీ లేఔట్‌లకు సంబంధించిన ఫైల్స్ వివరాలు:

ప్రభుత్వ భూములను, చెరువులను, కుంటలను ఆక్రమించిన బడా భూఅక్రమార్కులకు అనుకూలంగా నివేదికలు ఇవ్వడానికి ఈమె, ఏడీ శ్రీనివాసులతో కలిసి భారీ ఎత్తున ముడుపులు స్వీకరించింది. వచ్చిన అవినీతి సొమ్ములో అసిస్టెంట్ డైరెక్టర్ 60 శాతం, జూనియర్ అసిస్టెంట్ సునీతా బాయ్ 40 శాతం పంచుకున్నారంటే… ఈ అవినీతి భాగస్వామ్యం ఎంతగా బరితెగించిందో అర్థం చేసుకోవచ్చు. వీరి వద్ద కోకొల్లలుగా అక్రమ నివేదికలు ఉన్నాయంటే, రంగారెడ్డిలో ఎన్ని ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయో ఊహించడం కూడా కష్టమే!
ఏకంగా ఒక జూనియర్ అసిస్టెంట్ ఆస్తులు ఇవేనా?
కేవలం జూనియర్ అసిస్టెంట్ స్థాయిలో ఉన్న సునీతా బాయ్ ఆస్తులు చూస్తే, అత్యున్నత స్థాయి ఐఏఎస్ అధికారి కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తి చంద్రకాంత్‌ను సిస్టం ఆపరేటర్‌గా నియమించుకుని, అతనికి నెలకు రూ. 20,000 జీతం చెల్లిస్తోంది. అంతేకాకుండా, సొంత కారు డ్రైవర్‌కు మరో రూ. 20,000 వేతనం ఇస్తూ, ఆ డ్రైవర్ పేరు మీదనే ఒక కారును అద్దెకు కూడా తిప్పుతోంది.
‘వసూళ్ల రాణి’ అక్రమ ఆస్తుల చిట్టా:
వికారాబాద్ జిల్లాలో ప్లాట్లు, ఇల్లు.
నిజామాబాద్ జిల్లాలో నెలకు రూ. 2 లక్షలు అద్దె వచ్చే భవనం.
గుర్రం గూడాలో కోట్ల విలువ గల విలాసవంతమైన ఇల్లు.
ఆమె కొడుకు విలాసవంతమైన బెంజ్ కార్లలో తిరుగుతాడు. ఒక జూనియర్ అసిస్టెంట్ తన మొత్తం సర్వీసులో కష్టపడి సంపాదించినా ఇంత ఆస్తి కూడబెట్టడం అసాధ్యం. కానీ, సునీతా బాయ్ మాత్రం వందల కోట్ల భూముల దోపిడీలో భాగస్వామిగా మారి, కోట్లలో ఆస్తులు పోగేసింది. ఈమెకు డిపార్ట్ మెంట్‌లో ‘వసూళ్ల రాణి’ అనే పేరు కూడా స్థిర పడిరదంటే, ఈమె దైనందిన అవినీతి ఎంత బహి రంగ రహస్యమో అర్థమవుతోంది. ఆమె ప్రతి రోజూ లంచాల రూపంలో రూ. 30,000 నుంచి రూ. 40,000 వరకు వసూలు చేస్తుందని సమాచారం.
డిసెంబర్ 4వ తేదీన ఏసీబీ అధికారుల దాడులతో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు బాగోతం బయటపడగా, అదే రోజు సునీతా బాయ్‌కు కూడా ఏసీబీ అధికారులు ‘వార్నింగ్’ ఇచ్చారంటే… ఈమె అవినీతి చిట్టా, అక్రమ ఆస్తుల వివరాలు కూడా ఏసీబీ దగ్గర ఉన్నట్టేనా అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం ఏం చేస్తోంది?
తెలంగాణలో అత్యంత రెవెన్యూ వచ్చే జిల్లాలో, విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతుంటే, భూరికార్డులు చూసే కీలకమైన అధికారి, ఉద్యోగి కోట్లకు పడగలెత్తితే… ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఇంతకాలం ఏం చేస్తున్నారు? ఈ అవినీతిలో మరికొందరు పెద్ద తలకాయల పాత్ర ఉందా? అనే ప్రశ్నలు ప్రజల మదిలో మెదులుతున్నాయి.
ఏసీబీ అధికారులు ఇకనైనా ఈ ‘వసూళ్ల రాణి’ గుట్టును రట్టు చేసి, అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకుని, భూముల దోపిడీకి పాల్పడిన బడా బాబులపైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అవినీతికి పాల్పడి, అక్రమ ఆస్తులు కూడబెట్టి కటకటాల పాలైన ఏడీ శ్రీనివాసులు మరియు ‘వసూళ్ల రాణి’ రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం, కొండకల్ మరియు మొఖిల గ్రామాల గ్రామ సరిహద్దుల సవరణలు.. ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ ప్రాంత) భూమి శిస్తు చట్టం (Aూ (ుA) ూR Aష్), 1317 ఎఫ్ ప్రకారం సెక్షన్లు 87 మరియు 90 ల క్రింద, కొండకల్ గ్రామ సరిహద్దుల సవరణ కొరకు మరియు 117 ఎకరాల 16 గుంటల విస్తీర్ణంలో కొత్త సర్వే నంబర్ 555 కేటాయింపు కొరకు నిర్వహించి ఇరువురు కలసి చేసిన అవినీతి బాగోతంపై పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం.
